వీకెండ్ లో మిస్ అయిన డియ్యాలో వయ్యారి

Update: 2016-06-09 19:30 GMT
మరియం జకారియా.. ఇలా చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ 100 పర్సెంట్ లవ్ మూవీలో  ఐటెం గాళ్ గా కనిపించిందే ఆ అమ్మాయి.. అంటే మాత్రం ఠపీమని గుర్తు పట్టేయచ్చు. ఆ తర్వాత కూడా తెలుగులో నాలుగైదు సినిమాలు చేసింది కానీ అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. ఈలోగా బాలీవుడ్ లో కూడా సేమ్ డిట్టో ఇలాంటి పాటలనే చేసేసి పాతుకుపోదామని ట్రై చేసిన మరియం.. మధ్యలోనే పెళ్లి బాట పట్టేసింది. పెళ్లయ్యాక కూడా ఐటెం సాంగ్స్ లో డ్యాన్సులను కంటిన్యూ చేస్తూ.. ప్రేక్షకులను మరిచిపోలేదని చెబుతోంది.

వాస్తవానికి మరియం జకారియాది మన దేశం కాదు. స్వీడన్ పౌరసత్వం ఉన్న ఇరానియన్ బ్యూటీ ఈమె. ఇక్కడ ఆఫర్లు రావడంతో ఇండియాలోనే సెటిల్ అయిపోయిందంటే. అర్వింద్ ఠాకూర్ అనే వ్యక్తిని పెళ్లాడేయగా.. ఆర్యన్ అనే కొడుకు కూడా వీళ్లకు ఉన్నాడు. రెండేళ్ల క్రితం తమిళ్ మూవీ అంజాన్ లో మెరిసిన మరియం.. మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ మూవీలో కనిపించబోతోంది.

మిస్సింగ్ ఆన్ ఏ వీకెండ్.. ఇదే ఆ సినిమా పేరు. ఓ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేస్తోంది మరియం జకారియా. జూన్ 24న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం.. యూనిట్ తో పాటు ఈ ఐటెం సుందరి కూడా తెగ కష్టపడిపోతోంది. తను చేసే ఐటెం నెంబర్లలో వేసుకున్నట్లుగా పొట్టి పొట్టి గార్మెంట్స్ తో.. ప్రెస్ మీట్లలో సందడి చేసేస్తోంది. ఏమైనా అమ్మడిది బాగా జాలి గుండె. పెళ్లయిపోయింది కదా అని.. ఏ విషయంలోనూ పొదుపు మాత్రం పాటించడం లేదు.
Tags:    

Similar News