బాస్ ఈజ్ బ్యాక్.. రాజకీయాలు వదిలి మళ్లీ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించడమే గాక వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నంబర్ 150.. సైరా చిత్రాలతో దూసుకొచ్చారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చిరు తన కెరీర్ 152వ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రెండు మూడు విషయాల్లో మెగా ఫ్యాన్స్ ని ఫుల్ గా టెన్షన్ కి గురి చేస్తోందట. అందులో ఒకటి షూట్ డిలే.. ఇంకొకటి మతపరమైన అంశం. డీప్ గా వివరాల్లోకి వెళితే..
సహజంగానే కొరటాల శివ తన సినిమాలను కాస్త నెమ్మదిగా.. ఇంకాస్త ఆలస్యంగా తీస్తారన్న కామెంట్లు ఉన్నాయి. కానీ తాజా చిత్రాన్ని మాత్రం ఆరు నెలల్లో పూర్తి చేయాలని సరిలేరు నీకెవ్వరు ఆడియో ఫంక్షన్ లో చిరు స్వయంగా కొరటాల శివను కోరారు. దీంతో శివ కూడా చిరు మాటకు అక్కడే కమిట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు. ఇంత వరకు బాగానే ఉన్నా .. ఈ సినిమా కథ విషయంలో ఎందుకో చిత్ర యూనిట్ కొంత ఆందోళన చెందుతోందంట. ఎందుకంటే ఇందులో చిరు దేవాదాయ శాఖ ఉద్యోగిగా నటిస్తున్నారు. మెగాస్టార్ దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన అక్రమాలపై పోరాటం చేస్తారని సమాచారం. అయితే అసలు సమస్యంతా ఇక్కడే ఉందని చిరు అభిప్రాయ పడుతున్నారట. ఈ విషయంలో కొరటాల శివకు కూడా కొన్ని సూచనలు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో మతపరమైన అంశాలు ఇబ్బంది పెడతాయని అంచనా వేస్తున్నారట. ఎందుకంటే హిందూ మతానికి జరుగుతున్న అన్యాయంపై కొన్ని సీన్లను హైలెట్ చేసి తెరకెక్కించనునట్లు తెలిసింది. ఇది బీజేపీ పరిరక్షణ భావజాలానికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నట్లు ఉంటుందని.. ఇది కచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉందని చిరు సూచించారట. మరి కొరటాల ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తారోనని అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు.