ఎనిమిది దశాబ్ధాలు పైగా సుదీర్ఘమైన చరిత్ర టాలీవుడ్ కి ఉంది. మద్రాసు నుంచి పరిశ్రమ విడిపోయి హైదరాబాద్ లో వేళ్లూనుకోవడానికి అంచెలంచెలుగా ఎంతో సమయం పట్టింది. ఇక్కడ ఫిలింస్టూడియోలు.. ల్యాబులు.. థియేటర్లు విస్తరించేందుకు .. టెక్నాలజీ అభివృద్ధికి ఎంతో సమయం పట్టింది. అప్పట్లో 20- 30 మంది వరకూ ప్రముఖ సినీజర్నలిస్టులు ఉండేవారు. ఇప్పటికి 150 పైగా సినీజర్నలిస్టులు ఉన్నారు. పరోక్షంగా మరో 300 పైగా సినీజర్నలిస్టులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అతిపెద్ద అసోసియేషన్ గా ఫిలింక్రిటిక్స్ కి గుర్తింపు ఉంది. అయితే ఇటీవల ఈ సంఘం యాక్టివిటీస్ నామమాత్రంగా ఉండడంతో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ రీయాక్టివేట్ అయ్యి తిరిగి కార్యకలాపాల్ని యథావిధిగా సాగించే ప్రణాళికలో ఉంది. ఆ క్రమంలోనే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సినీజర్నలిజం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ ఉత్సవాల్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో తొలి అడుగు పడింది. నేడు (గురువారం) మెగాస్టార్ చిరంజీవిని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం ఆయన నివాసంలో కలిసింది. `సైరా-నరసింహారెడ్డి` ఘనవిజయం సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలను ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం అందించింది.
ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోల్డెన్‌జూబ్లీ వేడుకను వైభవంగా నిర్వహించబోతున్నామని ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవ్వాల్సిందిగా మెగాస్టార్ ని ఆహ్వానించారు. చిరు ను కలిసినవారిలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొండేటి సురేష్- కార్యదర్శి ఇ. జనార్దన్‌రెడ్డి- గోల్డెన్‌జూబ్లీవేడుక ఛైర్మన్ బి.ఎ.రాజు- సీనియర్ జర్నలిస్టు ప్రభు- అసోసియేషన్ ఉపాధ్యక్షులు డి.జి.భవాని- సజ్జావాసు- కోశాధికారి భూషణ్- సంయుక్త కార్యదర్శులు మడూరి మధు- పర్వతనేని రాంబాబు కార్యవర్గ సభ్యులు సాయిరమేష్- ముత్యాల సత్యనారాయణ- మురళి (శక్తిమాన్)- చిన్నమూల రమేష్- జిల్లా సురేష్ తదితరులు వున్నారు.