తెలంగాణ సీఎంకి మెగాస్టార్ కృత‌జ్ఞ‌త‌లు

Update: 2021-12-25 07:43 GMT
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ గేమ్ న‌డుస్తోంది. ఒక సీఎం పెంచుతామంటారు.. ఇంకో సీఎం తుంచుతామంటారు. మొత్తానికి ఇది ఒక క్రీడ‌లా మారింది. ఈ ఆట‌లో పావుగా మారింది ప‌రిశ్ర‌మ అన్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌రిశ్ర‌మ‌కు వ‌రాలు కురిపిస్తుంటే ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం క‌క్ష సాధింపుకు పాల్ప‌డుతున్నార‌ని బహిరంగంగా దుమ్మెత్తి పోస్తున్నారు.

ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల త‌గ్గింపుతో చిక్కొచ్చిప‌డింది. అక్క‌డ ప‌రిస్థితి అలా ఉండ‌గా.. ప‌రిశ్ర‌మ‌కు తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఊర‌ట ల‌భించింది. టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త జీవోని తీసుకొచ్చింది. హైకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు..ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధుల అభ్య‌ర్ధ‌న‌ల మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది.. ప‌రిశ్ర‌మ ప్రోత్సాహానికే ముందుకొచ్చింది. తాజాగా ఈ విష‌యంపై మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ కోరిక‌ను మ‌న్నించి..నిర్మాత‌ల‌కు..పంపిణీ దారుల‌కు.. థియేట‌ర్ల యాజ‌మాన్యానికి న్యాయం జ‌రిగేలా సినిమా టిక్కెట్ ధ‌ర‌ల్ని స‌వ‌రించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీర్ గారికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు. థియేట‌ర్ల మ‌నుగ‌డ‌కు..వేలాంది మంది కార్మికుల మేలు కోసం తీసుకున్న నిర్ణ‌యం ఇది`` అని చిరంజీవి ట్వీట్ చేసారు.

పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం జీఎస్టీ మిన‌హా ఏసీ థియేట‌ర్ల‌కు క‌నీస టిక్కెట్ ధ‌ర 50 రూపాయ‌ల‌ నుంచి గ‌రిష్టంగా 150 రూ..ల‌కు నిర్ణ‌యించారు. మ‌ల్టీప్లెక్స్ ల క‌నిష్ట ధ‌ర 100+ జీఎస్టీ..గ‌రిష్టంగా 250+ జీఎస్టీ..సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ రిక్లైన‌ర్ సీట్ ధ‌ర 200+ జీఎస్టీ.. మ‌ల్టీప్లెక్స్ ల్లో 300+జీఎస్టీ. టిక్కెట్ కి 5 రూపాయ‌లు ఎసీ ఛార్జ్..3 రూపాయ‌లు నాన్ ఏసీ ఛార్జ్ కింద వ‌సూల్ వెసులుబాటు థియేట‌ర్ల‌కి క‌ల్పించింది. మొత్తానికి తెలంగాణ థియేట‌ర్ వ్య‌వ‌స్థ వ్య‌వ‌స్థ దారిలోకి వ‌చ్చింది.

తెలంగాణ‌లో ధ‌ర‌లు పెంచ‌డం వెనుక ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ సోమేష్ కుమార్..మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్.. ఎంపీ సంతోష్ కుమార్ కీల‌క పాత్ర పోషించారు. వారికి ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అయితే కేసీఆర్ కి థాంక్స్ చెప్పారు స‌రే.. జ‌గ‌న్ ని ప్ర‌శ్నించ‌రా? అంటూ ఒక అభిమాని మెగాస్టార్ ని సోష‌ల్ మీడియాల్లో ప్ర‌శ్నించారు. ఏపీలో టికెట్ ధ‌ర‌ల‌పై సీఎం ని నిల‌దీయాల‌ని కోరారు.

ఏపీలో ప‌రిస్థితి మాత్రం తెలంగాణ‌కు పూర్తి విరుద్ధంగా ఉంది. అక్క‌డ టికెట్ దోపిడీ సాగుతోందంటూ ఆరోపిస్తూ.. ఏపీ స‌ర్కార్ ఉక్కు పాదం మోపి ముందుకు వెళుతోంది. ద‌శాబ్ధాలుగా అనుమ‌తులు లేకుండా ర‌న్ చేస్తోన్న థియేట‌ర్ల‌ను సీజ్ చేస్తోంది. అలాగే టిక్కెట్ ధ‌ర‌ల్ని ప్ర‌భుత్వం నిర్ధారించిన రేట్ల‌కే అమ్మాల‌ని...ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ద్వారా విక్ర‌యాలు జ‌ర‌గాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యంలో ప‌రిశ్ర‌మ నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. కొంత మంది ముఖ్య‌మంత్రి స‌రైన నిర్ణ‌యం తీసుకుని ముందుకు వెళ్లున్నార‌ని హ‌ర్షిస్తున్నారు. అలాగే ప్రేక్ష‌కులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


Tags:    

Similar News