బిగ్ బాస్ 8 : నామినేషన్స్ ఫైర్.. ఆడియన్స్ కు సూపర్ స్టఫ్..!
పాత కంటెస్టెంట్స్ అందరితో గౌతం గొడవ పెట్టుకున్నాడు. తనని టార్గెట్ చేస్తున్నారంటూ గౌతం వాళ్ల వాయిస్ కన్నా తన వాయిస్ నే ఎక్కువ వినిపిస్తున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 8 లో మండే వచ్చింది అంటే నామినేషన్స్ ఫైర్ ఉండాల్సిందే. హౌస్ లో ఏసీల చలి.. బయట శీతాకాలం చలి ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసేందుకు నామినేషన్స్ వేడి ఉంటుంది. అనుకున్నట్టుగానే ఈ వారం నామినేషన్స్ లో మరోసారి కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ జరిగింది. గౌతం ని నామినేట్ చేస్తూ నబీల్ అతని వాదన వినిపించాడు. ఇద్దరి మధ్య దాదాపు వాదన బాగానే జరిగింది. మరోపక్క ప్రేరణ, నిఖిల్ కూడా గౌతం తోనే గొడవ పడ్డారు. పృధ్విని నామినేట్ చేస్తున్న టైం లో కూడా అతనితో వాదన నడిచింది.
పాత కంటెస్టెంట్స్ అందరితో గౌతం గొడవ పెట్టుకున్నాడు. తనని టార్గెట్ చేస్తున్నారంటూ గౌతం వాళ్ల వాయిస్ కన్నా తన వాయిస్ నే ఎక్కువ వినిపిస్తున్నాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో మెగా చీఫ్ రోహిణి తప్ప మిగతా కంటెస్టెంట్స్ అందరు నామినేషన్స్ లో ఉన్నారు. పృధ్వి అవినాష్ ల మధ్య నామినేషన్స్ క్రమంలో వాదన నడిచింది. అవినాష్ ని నామినేట్ చేస్తూ హౌస్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తున్నాడని అన్నాడు.
అవినాష్ ఈసారి నామినేషన్స్ లో తన ఫైర్ చూపించాడు. పృధ్వికి తొడకొట్టి మరె ఛాలెంజ్ చేశాడు. అలా మండే నామినేషన్స్ ఇంకా పూర్తి కాకపోయినా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం మెగా చీఫ్ అయినందుకు రోహిణి తప్ప మిగతా వారంతా కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో తేజ, పృధ్వి, విష్ణు ప్రియ ఉంటారని తెలుస్తుంది. నిఖిల్, గౌతం, ప్రేరణ, నబీల్ లకు మంచి ఓటింగ్ వస్తుంది.
వీరితో పోల్చితే తేజ, పృధ్వి ఆ తర్వాత విష్ణు ప్రియకు తక్కువ ఓటింగ్ కనిపిస్తుంది. కానీ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాక ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ వారం అసలే డబుల్ ఎలిమినేషన్ అంటూ చెబుతున్నారు. అదే జరిగితే మాత్రం మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ రేసులో నిఖిల్, గౌతం లు ఉన్నారు. వీరిద్దరు మాతమే టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్నారు. వీరిలో టైటిల్ ని ఎవరు గెలుస్తారంటూ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఐతే తెలుగు వాళ్లంతా కూడా గౌతం కు సపోర్ట్ చేయాలని కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. బిగ్ బాస్ కి వచ్చిన వారిలో కూడా తెలుగు, కన్నడ అంటూ భాషాప్రాతిపదికన చూడటం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. మరి విన్నర్ ఎవరిని చేస్తారన్నది చూడాలి.