సూపర్‌ హిట్ సినిమా ఓటీటీలో ఎప్పుడంటే..!

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న డ్రాగన్‌కి సహజంగానే ఓటీటీ ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి.;

Update: 2025-03-18 07:40 GMT

తమిళ్‌ యంగ్‌ హీరో ప్రదీప్ రంగనాథన్‌ 'డ్రాగన్‌' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. లవ్‌ టుడే సినిమాతో తెలుగులోనూ ఇతడికి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపుతో డ్రాగన్‌ సినిమాను సైతం తెలుగులో విడుదల చేశారు. తమిళ్‌తో పాటు తెలుగులో డ్రాగన్‌ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈతరం యూత్‌ ఆడియన్స్‌కి తెగ నచ్చే విధంగా ఈ సినిమా ఉంది అంటూ రివ్యూలు వచ్చాయి. తెలుగులో ఈ సినిమా ఊహించని విధంగా వసూళ్లు రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమాను థియేటర్‌లో చూడని వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.


థియేట్రికల్‌ రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌కి డ్రాగన్‌ సిద్ధం అయ్యాడు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా మార్చి 21న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈమధ్య కాలంలో థియేట్రికల్‌ రిలీజ్ కంటే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ అయినప్పుడు ప్రేక్షకులు ఎక్కువ మంది చూస్తున్నారు. మిలియన్‌ల కొద్ది వ్యూస్‌ను దక్కించుకుంటూ, వందల మిలియన్‌ల వాచ్ అవర్స్‌ను దక్కించుకుంటున్న కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాల సరసన డ్రాగన్‌ సినిమా నిలుస్తుందనే విశ్వాసంను ఓటీటీ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న డ్రాగన్‌కి సహజంగానే ఓటీటీ ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి.

డ్రాగన్ సినిమా స్టూడెంట్ ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పే విధంగా ఉంది. యూత్‌కి మంచి మెసేజ్‌ను ఇవ్వడంతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయి. దాంతో సినిమాకి యూత్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి కూడా మంచి స్పందన దక్కింది. మరోసారి ఓటీటీ ద్వారా కూడా యూత్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ డ్రాగన్ సినిమాను ఎంజాయ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. మార్చి 21న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డ్రాగన్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను మేకర్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌ టీం మెంబర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

కోలీవుడ్‌ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'డ్రాగన్‌' సినిమాను కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ప్రదీప్‌ రంగనాథన్‌కి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగు ఇతర సౌత్ భాషల్లోనూ విడుదల చేశారు. అన్ని భాషల్లో కలిపి డ్రాగన్‌ సినిమా దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది అనే సమాచారం అందుతోంది. ఈమధ్య కాలంలో చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్‌ హిట్‌గా డ్రాగన్‌ నిలిచింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్స్‌గా నటించారు. కయాదు లోహర్‌కి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మరోసారి మంచి గుర్తింపు లభించింది.

డ్రాగన్‌ సినిమా కారణంగా కయాదుకి తెలుగులో మరో సినిమా ఆఫర్‌ దక్కిందని తెలుస్తోంది. మరో వైపు అనుపమ పరమేశ్వరన్‌కి ఈ సినిమాతో మరో విజయం దక్కింది. ఆమె మరికొంత కాలం కోలీవుడ్‌, టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. డ్రాగన్‌ హిట్‌తో ప్రదీప్‌ రంగనాథన్‌కి డైరెక్ట్‌ తెలుగు సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ యంగ్‌ హీరోతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి డ్రాగన్‌ సినిమా చాలా మందికి మంచి ఫ్యూచర్‌ను ఇచ్చింది అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News