అది కళ లేక అశ్లీలమా? అనేది కోర్టు నిర్ణయిస్తుంది.. షారుఖ్ ‘బేషరమ్’ పాటపై మిలింద్
తన ఫిట్‌నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచే నటుడు మిలింద్ సోమన్.‘బేషరమ్ రంగ్’ పాటపై కొనసాగుతున్న వివాదం మధ్య తన పాత ఫోటోషూట్ వివాదం గురించి మాట్లాడారు. 1995 సంవత్సరంలో, మిలింద్ సోమన్ న్యూడ్ ఫోటోషూట్ చేసారు. ఇది ఇప్పటివరకు చర్చనీయాంశమైంది. ఈ ఫోటోషూట్ కారణంగా, మిలింద్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. అతను దాని నుండి బయటపడటానికి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేశాడు. ఈ రోజుల్లో 'పఠాన్' చిత్రం , దాని పాట 'బేషరమ్ రంగ్' గురించి చాలా వివాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇంతకు 25 ఏళ్ల ముందు జరిగిన ఘటనను వివాదాస్పద ఫోటోషూట్‌ను ఈ సందర్బంగా మిలింద్ గుర్తు చేసుకున్నాడు.
-మధు సప్రేతో న్యూడ్ ఫోటోషూట్ చేశారు
మిలింద్ సోమన్ న్యూడ్ ఫోటోషూట్ తన స్నేహితురాలు మధు సప్రేతో కలిసి ఈ ఫోటోషూట్ చేశాడు. ఈ ఫోటోషూట్‌లో ఇద్దరూ మెడలో కొండచిలువను ధరించి కనిపించారు. ఈ న్యూడ్ ఫోటోషూట్‌లో ఇద్దరి పాదాలకు కేవలం బూట్లు మాత్రమే ఉన్నాయి. ఆ ఫోటో పబ్లిష్ అయిన వెంటనే ఎక్కడికక్కడ సందడి నెలకొంది. వివాదం పెరగడంతో ప్రకటనపై నిషేధం విధించారు. ఈ ఫోటోషూట్ తర్వాత, మిలింద్ అశ్లీలతను వ్యాప్తి చేశాడని ఆరోపించడమే కాకుండా వన్యప్రాణి సంరక్షణ కింద కోర్టులో కేసు కూడా నమోదైంది. ఈ న్యాయ పోరాటం 14 ఏళ్ల పాటు కొనసాగింది. చివరకు 2009లో ఈ కేసులో నటుడు నిర్దోషిగా విడుదలయ్యాడు.
-‘అది అశ్లీలమా, కళనా అనేది కోర్టు నిర్ణయిస్తుంది’: మిలింద్
షారుఖ్ ఖాన్ ‘బేషరమ్ రంగ్’ పాటపై కొనసాగుతున్న వివాదం మధ్య మిలింద్ సోమన్ టైమ్స్ నౌతో మాట్లాడుతూ, “ఇది కళా లేదా అశ్లీలమా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇది పరిష్కరించబడాలి" అని మిలింద్ అన్నారు.
షారుఖ్ ను వెనకేసుకొచ్చాడు. ముఖ్యంగా ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లోకి ఎక్కింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపిక పొట్టి బట్టలు, ఆమె బికినీ రంగును కాషాయరంగుతో ముడిపెట్టి తీయడం.. నగ్నంగా కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మిలింద్ తాజా వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. న్యూడ్ ఫొటో షూట్ లు, ఇలాంటి పాటలను రాజకీయం చేయవద్దని సూచించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.