సైరా టీమ్ వేసుకున్న లెక్క తప్పిందా

Update: 2019-10-06 11:47 GMT
పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎంత కలెక్షన్స్ సాధించింది అనే విషయం కంటే కూడా బ్రేకీవెన్ అయిందా.. బయ్యర్లు సేఫ్ అయ్యారా అనేదే ముఖ్యం.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా 'సైరా' సినిమా గురించి ట్రేడ్ వర్గాలలో ఈ విషయంలోనే చర్చలు సాగుతున్నాయి. 'సైరా' ఓ భారీ బడ్జెట్ సినిమా.  తెలుగు సినిమా బడ్జెట్ స్థాయిని మించి ఖర్చుపెట్టారనేది అందరికీ తెలిసిందే.  అయితే ఈ సినిమా రికవరీపై సైరా టీమ్ వేసుకున్న లెక్కలు తప్పాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

'సైరా' టీమ్ అక్టోబర్ 2 న రిలీజ్ డేట్ ఎంచుకోవడంలో మొదటిరోజు పబ్లిక్ హాలిడేతో పాటుగా దసరా సీజన్ ఎడ్వాంటేజ్ తో కలెక్షన్స్ రాబట్టవచ్చని భావించారు.  ఓవర్సీస్ లో మంగళ వారం రిలీజ్ అయితే టికెట్ ఆఫర్లతో మంచి కలెక్షన్స్ నమోదు చేయవచ్చని అనుకుంటే అక్కడ అనుకున్నట్టుగా జరగలేదు.  రోజురోజుకు అక్కడ కలెక్షన్స్ డ్రాప్ అవుతూనే ఉన్నాయి.  ఇక ఇతర భాషల వసూళ్ళపై నమ్మకం పెట్టుకున్నా అన్నీ చోట్లా ఈ సినిమాకు నిరాశ తప్పలేదు.

తెలుగు రాష్ట్రాల విషయం తీసుకుంటే మొదటి రోజు కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి కానీ రెండోరోజుకు.. మూడో రోజులు డ్రాప్ కనిపించింది.  అయితే వర్కింగ్ డేస్ కాబట్టి డ్రాప్ సహజమే అనుకున్నారు. వీకెండ్ లో శనివారం నుంచి కలెక్షన్స్ పుంజుకుంటాయని భావిస్తే శనివారం కూడా కలెక్షన్స్ లో మెరుగుదల కనిపించలేదు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడం ప్రతికూలంగా మారిందనే వాదన వినిపిస్తోంది.  ఏరియాలను బట్టి రూ. 150 నుండి రూ. 300 వరకూ టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేయడంతో ఫుట్ ఫాల్స్ తగ్గాయని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఇక మిగిలింది పండగ ఉండే మూడు రోజులే.  ఇప్పటివరకూ రికవరీ యాభై శాతమే కాబట్టి  మరో యాభై శాతం రికవరీ చేయాల్సి ఉంది.  ఆది.. సోమవారాలు కలెక్షన్స్ మెరుగైతే ఫరవాలేదు కానీ డ్రాప్ కొనసాగితే మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.  మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News