స్టార్ డెడికేషన్ అంటే ఇది

Update: 2018-01-01 10:25 GMT
సినిమా హీరోలు ఒక స్టేజికి వచ్చాక, ఒక రేంజ్ అందుకున్నాక కొంతమందిలో కమిట్మెంట్ లెవెల్స్ బాగా పడిపోతాయి. కారణం మనం ఏం చేసినా జనం చూస్తారు అనే ధీమా. అలాంటి ఆటిట్యూడ్ ఉన్న హీరోలు ఎంత పెద్ద వాళ్లైనా సరే తక్కువ టైంలో కనుమరుగు అయిపోవడం చరిత్ర చూసింది. కాని కొందరు సీనియర్ హీరోలు మాత్రం తమ ముదిమి వయసు లెక్కచేయకుండా ఆరు పదుల వయసు దాటినా ప్రేక్షకులను అలరించడం కోసం తమ ఆరోగ్యాన్ని - ప్రాణాన్ని సైతం రిస్క్ లో పెట్టి సిద్ధ పడుతూ ఉంటారు. అలాంటివారి అరుదైన జాబితాలో ఉండే వ్యక్తి మోహన్ లాల్. శ్రీకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఓడియన్ అనే సినిమాలో టైటిల్ పాత్ర పోషిస్తున్న మోహన్ లాల్ అందులో 30 ఏళ్ళ యువకుడిలా కనిపించడం కోసం తన బరువును సగానికి పైగా తగ్గించుకోవడం చూస్తే మతులు పోవడం ఖాయం. ఓ పది కేజీలు తగ్గడానికి యువకులు సైతం నానా అవస్థలు పడే పరిస్థితుల్లో మోహన్ లాల్ చేసింది ముమ్మాటికి సాహసమే.

మోహన్ లాల్ వయసు ఐదు పదులు ఎప్పుడో దాటేసాడు. గవర్నమెంట్ జాబు లెక్కల్లో చూసుకుంటే కనక మోహన్ లాల్ రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. కాని కళాకారుడికి అది వర్తించదు కాబట్టి మోహన్ లాల్ ఇంతటి రిస్క్ తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన జనతా గ్యారేజ్ లో చూసిన మోహన్ లాల్, పైన మీరు చూస్తున్న మోహన్ లాల్ ఒక్కటే. ఇప్పుడు కనక జూనియర్ ఎన్టీఆర్ పక్కన నిలబెడితే అన్నదమ్ములు అనుకోవడం ఖాయం. అంత మేకోవర్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది మల్లు వుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల్లో చర్చనీయాంశం అయ్యింది. తనను కంప్లీట్ యాక్టర్ అని ఎందుకు అంటారో మాటల ద్వారా కాకుండా చేతల్లో రుజువు చేస్తున్న మోహన్ లాల్ సిన్సియారిటీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది. ఈ ఫోటోలలో నటుడిని చూస్తే ఎవరైనా ఒప్పుకుంటారు.
Tags:    

Similar News