గత ఏడాది ‘మనమంతా’.. ’జనతా గ్యారేజ్’ సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఈ ఊపులో ఆయన మలయాళంలో నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా తెలుగులోకి డబ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ ‘పులి మురుగన్’ను డబ్ చేసి ’మన్యం పులి’ రిలీజ్ చేస్తే ఆ సినిమా సర్ప్రైజ్ హిట్టయింది. దీంతో లాల్ మరో హిట్ మూవీ ‘ఒప్పం’ను కూడా తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగు వెర్షన్ కు ‘కనుపాప అనే టైటిల్ పెట్టారు. ఎప్పుడో డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చక్కటి పోస్టర్లు డిజైన్ చేసి.. పబ్లిసిటీ కూడా కొంచెం జోరుగానే చేస్తున్నారు.
‘ఒప్పం’ లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సినిమా. మోహన్ లాల్ ఇందులో పాక్షిక అంధత్వం ఉన్న వికలాంగుడిగా నటించాడు. అతను ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసులో అతనే సాక్షి. అలాగే అతనే హత్య చేశాడన్న అనుమానాలుంటాయి. ఉత్కంఠ రేపుతూ సాగే ఈ థ్రిల్లర్ మూవీ మలయాళంలో పెద్ద హిట్టయింది. ఈ చిత్రాన్ని ముందు తెలుగు.. తమిళ భాషల్లో రీమేక్ చేయాలనుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ ఈ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఐతే తెలుగులో మోహన్ లాల్ చేసిన అంధుడి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడమో.. మరో కారణమో కానీ అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి ‘మన్యం పులి’ లాగే ఇది కూడా సర్ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.