బెంగళూరులో సెటిలైన ఒక తెలుగు వ్యక్తి కన్నడలో ఒక సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. తక్కువ బడ్జెట్ తో ప్రయోగాత్మక సినిమా చేసే అవకాశం ఉంటుందని అక్కడ ఒక సినిమా రూపొందించాడు. ఇదొక భిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందించిన సినిమా అని తెలుస్తోంది. ఆ సినిమా పేరు 'మౌనం'
ఒక మనిషి ఒంటరిగా ఉంటే.. అతడి మెదడులో అనేక ఆలోచనలు మొదలవుతాయి. ఎన్నో ఎమోషన్స్ అందులో రన్ అవుతూ ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ తో రూపొందిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఈ సినిమా. ఈ సినిమాలో విభిన్నరకాల ఎమోషన్స్ ను క్యాప్చర్ చేసినట్టుగా సమాచారం. ఒక మనిషి సైలెంట్ గా ఉన్నప్పుడు అతడి మైండ్ సౌండ్ చేయడం మొదలువుతుందంటూ ప్రారంభం అయ్యే సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని దాని రూపకర్తలు విశ్వాసంగా చెబుతున్నారు.
అయితే ఇప్పుడు ఎటొచ్చీ ఈ సినిమా విడుదలకు థియేటర్ల కష్టం కలుగుతూ ఉంది. ఈ సినిమా రూపొందింది కన్నడంలోనే అయినప్పటికీ అక్కడ కన్నడ సినిమాలకు థియేటర్లు కష్టంగా ఉంటుంది. అందులోనూ అంత స్టార్ కాస్ట్ లేదు. దీంతో మరింత ఇబ్బందికరంగా మారింది పరిస్థితి. బుక్ మై షో వెబ్ సైట్లో ఈ సినిమా పట్ల నెటిజన్లు ఆసక్తిని కనబరిస్తే.. ఈ సినిమాకు అక్కడ థియేటర్లు లభించే అవకాశాలు ఉంటాయి. అందుకే తెలుగు వారి నుంచి ఈ సపోర్ట్ ను కోరుకుంటున్నారు దీని రూపకర్తలు.
ఇది ఈ సినిమాకు సంబంధించి బుక్ మై షో లింక్. దీని మీద క్లిక్ చేసి.. ఈ సినిమాపై ఇంట్రస్ట్ ను చూపించాల్సిందిగా వారు కోరుతున్నారు. కనీసం 20 వేల ఇంట్రస్ట్ లు వ్యక్తం అయితే.. తెలుగు వారు రూపొందించిన ఈ కన్నడ ప్రయోగాత్మక సినిమాకు కాస్త థియేటర్లు దక్కే అవకాశం ఉంటుంది. ప్రవాసంలోని తెలుగు వారికి తెలుగు నెటిజన్లు ఈ హెల్ప్ చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.