ఇటీవలే బలవన్మరణానికి పాల్పడిన సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి రోజుకో చర్చ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నిన్నటి వరకు సుశాంత్ మరణం పై సంబంధం లేదన్నట్లు కొందరు మాట్లాడితే.. మరి కొందరు అతనిలోని మంచితనాన్ని బహిర్గతం చేస్తున్నారు. తాజాగా సుశాంత్ మంచితనం.. నిజాయితీ గురించి సుశాంత్ లాస్ట్ సినిమా డైరెక్టర్ ముకేశ్ చాబ్రా స్పందించాడు. తాజాగా సుశాంత్.. సంజన సంగి హీరోహీరోయిన్లుగా ముకేశ్ రూపొందించిన సినిమా 'దిల్ బేచారా'.
అయితే సినిమా విడుదలకు సిద్ధమైన సమయంలో సుశాంత్ మరణించడం ఎందరినో కలచివేసింది. డైరెక్టర్ ముకేశ్ సుశాంత్ గురించి స్పందిస్తూ.. ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. దర్శకుడుగా ముకేష్‌కు ఇదే ఫస్ట్ సినిమా. ముకేశ్ ని డైరెక్టర్ చేస్తానని సుశాంత్ తన ఫస్ట్ సినిమా 'కైపోచే' టైంలోనే మాటిచ్చినట్లు గుర్తుచేశాడు దర్శకుడు. ఆ మాట ప్రకారం సుశాంత్ హీరోగా దిల్ బేచారా సినిమా తీసి తన మాట నిలబెట్టుకున్నాడట. అయితే ముకేశ్ - సుశాంత్ ల స్నేహం ఇప్పటిది కాదట. కైపోచే సినిమాకి ముకేశ్ డైరెక్షన్ డిపార్టుమెంటులో పని చేశాడట.
అప్పట్నుంచి ఇద్దరం మంచి స్నేహితులం.. నన్ను సుశాంత్ ఎంతగానో ప్రోత్సహించాడని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అంతేగాక ఎప్పటికైనా దర్శకుడిగా తొలి సినిమా నాతోనే ఉంటుందని సుశాంత్ చెప్పాడని.. ఆ హామీని నిలబెట్టుకుంటూ ‘దిల్ బేచరా’తో నన్ను దర్శకుడిని చేసాడని" ముకేశ్ ఎమోషనల్ అయిపోయారు. సుశాంత్ నా సినిమాకి హీరో మాత్రమే కాదు.. నా లైఫ్ లో ఎన్నో ఇబ్బందులకు ఆయన సహాయం అందించడని డైరెక్టర్ సుశాంత్ మంచితనం గురించి వెల్లడించారు. సుశాంత్ లేకుండా తన సినిమా రిలీజ్ అవుతున్నందుకు బాధగా ఉందని డైరెక్టర్ కాస్త ఉద్వేగానికి గురయ్యారు.