ప్రతి సంవత్సరం సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు సంక్రాంతి సినిమాల మధ్య యుద్ద వాతావరణం ఉంటుంది. కొన్ని సార్లు మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉంటుంది. ఈసారి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు ఉన్న కారణంగా బాక్సాఫీస్ వార్ హోరా హోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిరంజీవి మరియు బాలకృష్ణ లు గతంలో పలు సార్లు సంక్రాంతికి పోటీ పడ్డారు. అయితే ఈసారి చాలా స్పెషల్ గా సంక్రాంతి పోటీ నిలువబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా వంద కోట్లకు పైబడిన బడ్జెట్ తో రూపొందాయి. పైగా ఈ రెండు సినిమాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ లో రూపొందాయి.
ఈ రెండు సినిమాలు కూడా భారీ క్రేజ్ తో పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల యొక్క నిర్మాణ సంస్థ ఒక్కటే అవ్వడం వల్ల ఏదో మ్యాజిక్ జరగబోతుందని ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ రెండు సినిమాల ప్రమోషన్ కోసం ఇద్దరు హీరోలను ఒకే స్టేజి పైకి తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి మరియు బాలకృష్ణ ల మధ్య పోటీ ఉంటుంది.. అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది. కానీ వారిద్దరు మాత్రం మంచి స్నేహితులుగానే మెలుగుతూ ఉంటారు.
పలు సార్లు చిరు మరియు బాలయ్య లు స్టేజ్ షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కనుక ఈసారి మైత్రి వారి కోసం తమ సినిమాల యొక్క ప్రమోషన్ కోసం ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం లేదంటే ఏదైనా కార్యక్రమంకు కలిసి హాజరు అవ్వడం జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ విషయంలో దాదాపుగా సక్సెస్ అయినట్లే అని.. ఇద్దరు హీరోలను ఒకే స్టేజి పైకి తీసుకు వచ్చేందుకు ఒప్పించారని.. అయితే అది చాలా స్పెషల్ గా ఉండాలని.. రెండు సినిమాల యొక్క స్థాయిని పెంచే విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే షురూ అయ్యాయి. ఈ సందర్భంగానే హీరోల ఇద్దరి ప్రత్యేక కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.