బ‌న్నీ సినిమాను ఆపేసిన ఆ సీఎం

Update: 2018-02-05 08:25 GMT
అల్లు అర్జున్ సినిమాకు అంత‌రాయం... వేగంగా షూటింగ్ పూర్తి కానిచ్చి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేదామ‌నుకున్నాడు. కానీ ఒక సీఎం వ‌ల్ల షూటింగ్ ఆగిపోయింది. అది కూడా మన రాష్ట్ర సీఎం కాదు... ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వ‌ల్ల.

వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ నాపేరు సూర్య సినిమా చేస్తున్నాడు. అందులో నిజ‌మైన సైనికుడిలా క‌నిపిస్తున్నాడు బ‌న్నీ. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సైనికుడా పాట మంచి ప్ర‌శంస‌లు అందుకోవ‌డంతో... మ‌రీ ఉత్సాహంగా ప‌నిచేస్తోంది టీమ్‌. అందుకేనేమో షూటింగ్ నిజ‌మైన చ‌లి వాతావ‌ర‌ణంలో, భార‌త స‌రిహ‌ద్దులో చేస్తున్నారు. మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అల్లు అర్జున్ అండ్ టీం షూటింగ్ జరుపుతున్నారు. ప్ర‌స్తుతం డార్జిలింగ్‌లో ఉంది నాపేరు సూర్య టీమ్‌. అక్క‌డ ఇంకా ప‌దిహేను రోజుల షెడ్యూల్ ఉంది. ఈ లోగా పోలీసులు నాలుగురోజుల పాటు షూటింగ్ నిలిపివేయ‌మ‌ని ఆదేశించారు. ఎందుకంటే ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ ప‌ర్య‌ట‌న ఉంద‌క్క‌డ‌. దీంతో చేసేదేమీ లేక షూటింగ్ ఆపేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నాలుగు రోజులు ఏం చేయాలో తెలియ‌క... అక్క‌డే మ‌కాం వేశారు. డార్జిలింగ్ స‌హ‌జ అందాల‌ను చూసి ఆనందిస్తున్నారు.

మ‌న సైనికులు దేశ‌స‌రిహ‌ద్దులో, మైన‌స్ డిగ్రీల చ‌లిలో కూడా ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి దేశ ర‌క్ష‌ణ‌కు నిల‌బ‌డ‌తారో... అదే పాత్ర‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌బోతున్నాడు. అను ఇమ్మానుయేల్ ఇందులో క‌థానాయిక‌. బాలీవుడ్ మ్యూజిక్ మాంత్రికులు విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ త‌రువాత‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్తి చేసి ఏప్రిల్ 27న విడుదల చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది టీమ్‌. ఈ సినిమాలో సైనికుడి పాత్ర‌లో అల్లు అర్జున్ అంద‌రికీ న‌చ్చేస్తాడంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
Tags:    

Similar News