‘ఇస్మార్ట్ పిల్ల’ నటనకు.. యూత్ పోరలు ఫిదా

Update: 2020-12-27 01:30 GMT
‘‘రేయ్ ఎవడ్రా నువ్వు..? ఒంటి మీద షటాక్ మాసం లేదు.. నువ్వు రౌడీవా? దమ్ముంటే ముందుగాల నాతో కొట్లాడురా’’ అని.. ‘ఇస్మార్ట్ శంకర్’లో హీరో రామ్ తో కన్నడ బ్యూటీ నభా నటేష్ చెప్పిన డైలాగ్స్ ఇంకా యూత్ పోరలు మర్శిపోలేదు. అద్దిరిపోయే యాక్టింగుతో.. మత్తెక్కించే రొమాన్స్ తో పోరగాళ్ల గుండెల్లో గుబురేపింది ఈ పిల్ల.

శానా గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘సోలో బతుకే సో బెటర్’ అంటూ ప్రేక్షకుల ముందటికొచ్చింది ఈ ఇస్మార్ట్ పిల్ల . యాజిటీజ్ గా ఈ సైన్మాలోనూ యాక్టింగ్ తో కేకపెట్టించిన నభా.. యూత్ పోరలతో అబ్బా అనిపించింది. శానా దినాల తర్వాత థియేటర్ల తెరలు తెరుచుకోవడం.. ఈ సైన్మా మస్తుగుందనే మాట ఇనిపిస్తుండడంతో టాకీసులకు బాగానే పోతున్నరట ఆడియన్సు.

ఈ సినిమాల హీరో సాయి ధరం తేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా యాక్టు చేసింది పిల్ల నభా నటేషు అని ఆడియన్సు తెగ మెచ్చుకుంటున్నరు. సినిమాలో ఎక్కడెక్కడ బొక్కలున్నయా.. అని వెతికే విమర్శకులు గూడా.. పిల్ల బాగా యాక్టింగ్ చేసిందని చెపుతున్నరు. అల్లరి పిల్లగా తన సత్తా చూపెట్టిందని అంటున్నరు సినిమా చూసినోళ్లు. ఇంకా.. మెగా హీరో సాయి తేజతో నభా కెమిస్ట్రీతోపాటు ఫిజిక్సు గూడా బాగానే కుదిరినై అంటున్నరు. ‘ఇస్మార్ట్ శంకర్’ లో మాస్ పొల్ల లెక్క అదరగొట్టిన నభా.. ఈ సైన్మాల క్లాస్ పిల్ల లెక్క యాాక్టింగ్ చింపేసిందట.

ఇగ, ఫస్టు సైన్మాతోనే అందరి కళ్లు తనమీద పడేట్టు చేసుకున్న నభా నటేషు.. ‘సోలో బతుకే సో బెటర్’ సైన్మాాతో పిల్ల యాక్టింగు కేక అనిపించుకుందని అంటున్నరు అందరూ. ఇగనుంచి.. కొత్త సైన్మాల ఆఫర్లు ఫుల్లుగ వస్తయి ఈ కన్నడ పిల్లకు అంటున్నరు శానా మంది. ఇగ, చూడాలె మరి.. ఎట్లాంటి సైన్మాలల్ల.. ఏయే హీరోల పక్కన యాక్టింగ్ చేస్తదో...
Tags:    

Similar News