ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కొచ్చని నిరూపిస్తున్నాడు నాగ్ అశ్విన్. దర్శకుడిగా తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు. అటుపై రెండవ సినిమా `మహానటి`తో విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి దర్శకుడిగా తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకున్నారు నాగ్ అశ్విన్. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే ఆయన `మహానటి` తరువాత మరో చిత్రాన్ని ఇంత వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం రిలాక్స్ మోడ్‌లో వున్న ఆయనకు కన్ను ఓ క్రౌడ్ ఫిండింగ్ సినిమాపై పడింది. వెంటనే ఆ సినిమాకి సాయం కోసం నిధి సేకరణకు రెడీ అవ్వడం హాట్ టాపిక్.
కొత్త దర్శకుడు విద్యాధర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ క్రౌడ్ ఫండింగ్ చిత్రాన్ని `గామీ` అనే పేరుతో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధంచిన ఎవ్రీ డీటైలింగ్ చూసి ఆశ్చర్యపోయిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు. అక్టోబర్ లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్న నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ఆగస్టులో ఓ వీడియో చూశాను. ఇలాంటి వీడియోస్ ని సాధారణంగా మనం హాలీవుడ్‌లో చూస్తుంటాం. ఇండియన్ ఫిల్మ్స్ లో పిచ్ వీడియోను చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే ఆ చిత్ర బృందానికి మెసేజ్ చేశాను. ఈ చిత్రాన్ని కార్తీక్ నిర్మిస్తున్నారు. ఈ టీమ్ వర్క్ చూశాక తెలుగులో ఇదొక కొత్త ప్రయోగం అవుతుందని నమ్ముతున్నాను` అంటూ తన సపోర్ట్ ని నాగ్ అశ్విన్ తెలియజేయడం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. క్రౌడ్ ఫిండింగ్ విధానంలోనే సంచలనం సృష్టించనున్న `గామి` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి. ఇదే తరహాలో ఇదివరకూ పలు చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే.
Full View