మహానటి సినిమా ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ సాధించింది. సావిత్రి బయోపిక్ ఇప్పటి తరానికి నచ్చుతుందా? ఎంతమంది థియేటర్లకి వస్తారు? అంటూ వచ్చిన విమర్శలకు మహానటి సినిమా సరైన సమాధానం చెప్పింది. ఇప్పుడు అంతా దర్శకుడు నాగ అశ్విన్‌ను నటి కీర్తి సురేష్ ను తెగ పొగిడేస్తున్నారు. నాగ అశ్విన్ ఇప్పుడు అతి బిజీ దర్శకుడు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. త్వరలో చిరుతో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
మహానటి సినిమా విడుదలయ్యాక నాగ అశ్విన్ ప్రశంసలతో పాటూ అవకాశాలు కూడా పెరిగాయి. తాజాగా ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అశ్విన్ చిరంజీవి హీరోగా సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడట. అందుకు సంబంధించి నాగ అశ్విన్ ప్రియాంక దత్ స్వప్నా దత్ ల మధ్య ప్రస్తుతం చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా పాతాళ భైరవి టైపులో ఉంటుందని అలాగే టైమ్ మెషీన్ నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. చిరు ఈ ప్రాజెక్టుకు ఓకే చేస్తే దాదాపు ఏడాది సమయం స్క్రిప్టు వర్కు కోసం కేటాయించడానికి నాగ అశ్విన్ సిద్దంగా ఉన్నాడని తెలుస్తోంది. చిరు కూడా ఓకే చెప్పి ప్రాజెక్టు పట్టాలెక్కితే... ఆ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా ఉండాలని భావిస్తున్నట్టు కూడా టాక్స్ వినిపిస్తున్నాయ్. అశ్వనీదత్ కూడా చిరుతో మళ్లీ సూపర్ హిట్ సినిమా తీయాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. చిరంజీవి ఈ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకుంటే మరో అద్భుతమైన సినిమా మనమందుకు వస్తుందన్న మాట.
రంగస్థలం భరత్ అనే నేను నా పేరు సూర్య ఎన్నో పెద్ద సినిమాల పేర్లను మరిచిపోయేలా చేసింది ఈ వేసవిలో విడదులైన మహానటి. సావిత్రి జీవితాన్ని హృద్యంగా తెరకెక్కించాడు నాగ అశ్విన్. కీర్తి సురేష్ కు ఈ సినిమా కెరీర్‌లో ఓ మలుపు అని చెప్పవచ్చు.