నాగ‌చైత‌న్య‌ మార్పులు కోరుకుంటున్నారా?

Update: 2022-06-02 00:30 GMT
టాలీవుడ్ క్రేజీ హీరోల్లాగే నాగ‌చైత‌న్య కూడా బిగ్ లైన‌ప్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నాడు. ప్ర‌స్తుతం స్టార్ హీరోల నుంచి మినిమ‌మ్ గ్యారంటీ హీరోలంతా వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వుంటే నాగ‌చైత‌న్య కూడా అదే త‌ర‌హాలో మూడు ప్రాజెక్ట్‌ల‌తో ఫుల్ బిజీగా వున్నారు. ఈ సంక్రాంతికి తండ్రి నాగార్జున తో క‌లిసి 'బంగార్రాజు' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన నాగ‌చైత‌న్య ఈ మూవీతో భారీ విజ‌యాన్ని అందుకోలేక‌పోయినా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర‌వాలేద‌నిపించాడు.

ఆరు నెల‌ల్లో బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో సంద‌డి చేయ‌బోతున్నాడు. త‌ను హీరోగా న‌టిస్తున్న 'థాంక్యూ' జూలై 8న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఇక అమీర్ ఖాన్ తో చేసిన 'లాల్ సింగ్ చ‌ద్దా' ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వీటితో పాటు ఇదే ఏడాది 'ధూత‌' అనే వెబ్ సిరీస్ ని చేస్తున్నాడు. విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ డ్రామా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

దీని త‌రువాత చై త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు తో ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే చై - ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ కు సంబందించి తాజాగా ఓ ఆస‌క్తిక‌రమైన వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  నాగ‌చైత‌న్య స్టార్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ తో ఓ సినిమా చేయాల్సింది. 14 ప్ల‌స్ రీల్స్ సంస్థ ఈ మూవీని నిర్మించాల‌ని ప్లాన్ చేసింది. 'స‌ర్కారు వారి పాట‌'కు ముందు ప‌ట్టాలెక్కాల్సిన ఈ మూవీ మ‌హేష్ ప్రాజెక్ట్ కార‌ణంగా వాయిదా ప‌డింది.

అయితే ఇటీవ‌లే 'స‌ర్కారు వారి పాట‌'ని పూర్తి చేసి ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ఫ్రీ అయినా చైతూ మాత్రం అత‌నికి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. కార‌ణం ముందు చెప్పిన స్క్రిప్ట్ లో మార్పులు చేయాల‌ని నాగ‌చైత‌న్య సూచించార‌ట‌.

అంతే కాకుండా సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ని మ‌రింత‌గా పెంచ‌మ‌ని మార్పులు చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం ఆ మార్పులు చేసే ప‌నిలో ప‌ర‌శురామ్ వున్నార‌ని తెలుస్తోంది. మార్పులు చేర్పులు పూర్తి చేసినా ప‌ర‌శురామ్ .. చై కోసం ఏడాది వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

వెంక‌ట్ ప్ర‌భు బై లింగ్వ‌ల్ పూర్తి చేయాలి. ఆ త‌రువాత విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో చేస్తున్న వెబ్ సిరీస్ 'ధూత‌'ని పూర్తి చేయాలి. ఈ రెండు పూర్తి చేయాలంటే ఏడాది ప‌డుతుంది. అందుకే ప‌ర‌శురామ్ ఏడాది వ‌ర‌కు వేచి చూడ‌క‌త‌ప్ప‌ద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News