పొగడ్తలకు.. సినిమా ఇండస్ట్రీకి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఎంత పొగిడినా సిగ్గుపడని లక్షణం సినిమావాళ్లకు కూసింత ఎక్కువన్న ఎటకారం ఉంది. దీనికి తగ్గట్లే సినీ నటుల తీరు ఉంటుంది. తాము చేసే సినిమాల్ని పొగిడితే ఓకే. ఏ మాత్రం తప్పు పట్టినా.. బాగోలేదన్నా ఆగ్రహంతో ఊగిపోతుంటారు.
ఇక.. సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూయర్లు తమ తీర్పును ఇచ్చేయటం.. అందులో తేడాలు దొర్లితే ఉగ్ర నరసింహావతారాన్ని ప్రదర్శించటం మామూలే. ఇలా అందరికి అలవాటైన పోకడలకు కాస్త భిన్నంగా.. ఏ మాత్రం ఊహించలేని రీతిలో వ్యవహరించి ఆశ్చర్యచకితుల్ని చేశారు యువసామ్రాట్ నాగచైతన్య. తాజాగా అతగాడు నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి రివ్యూయర్లు ఇచ్చిన రేటింగ్ పూర్ గా ఉంది.
రోటీన్ సినిమానే అయినా..ట్రీట్ మెంట్ కాస్త భిన్నంగా ఉండి ఎంటర్ టైన్ చేసే ఈ మూవీని రివ్యూయర్లు హోల్ సేల్ గా సో.. సో అని తేల్చేశారు. రిలీజ్ ముందు అందరి దృష్టిని ఆకర్షించి.. అంచనాలు భారీగా ఉన్న చిత్రానికి నెగిటివ్ రివ్యూలు హర్ట్ చేయటమే కాదు.. బిజినెస్ మీద అది చూపించే ప్రభావంతో ఇరిటేట్ సహజం.
ఇలాంటి వేళ సినిమా హీరో మొదలు దర్శకుడు వరకూ అందరూ రివ్యూయర్ల మీద మాటల దాడిని షురూ చేయొచ్చు. కానీ.. ఇందుకు భిన్నంగా వ్యవహరించి తన మాటలతో మనసుల్ని దోచేశాడు చైతూ. మారుతి దర్శకత్వం వహించిన శైలజారెడ్డి అల్లుడు రివ్యూలకు.. ప్రేక్షకాదరణకు మధ్య తేడా ఎక్కువనే చెప్పాలి. నెగిటివ్ టాక్ ఉన్నా.. సరైన సినిమా లేకపోవటం.. యూటర్న్ కు మంచి టాక్ రాకపోవటంతో శైలజారెడ్డి అల్లుడుకు మేలు చేసిందని చెప్పాలి.
తమ సినిమాపై రివ్యూయర్లు పెదవి విరవటంపై తాజాగా చైతూ స్పందించాడు. సినిమా విడుదలైన రోజు ఉదయం కాస్త డిజప్పాయింట్ అనిపించిందని.. కొందరు రివ్యూయర్స్ ని తాను సంతృప్తి పర్చలేకపోయానంటూ సారీ చెప్పేసి సరికొత్త అనుభవాన్ని మిగిల్చాడు. వేలెత్తి చూపించిన వారిపై విరుచుకుపడే ఈ రోజుల్లో.. అందుకు భిన్నంగా కొందరు రివ్యూయర్లును సంతృప్తిపర్చలేకపోయిన తనను క్షమించాలన్న చైతూ.. తర్వాతి చిత్రంలో మరింత కష్టపడతానని చెప్పి.. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలంటూ హుందాగా మాట్లాడి మనసుల్ని దోచేశాడు. మొత్తానికి తనను విమర్శించిన వారిని.. తన సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వారిని చైతూ డీల్ చేసిన వైనం కొత్తగా ఉండటమే కాదు.. అరే.. ఎంత హుందాగా మాట్లాడాడు అన్నట్లుగా ఉంది. కీపిట్ చైతూ.