టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఎవరైనా ఓపెన్ గా మాట్లాడాలి అంటే నాగార్జున తర్వాతే అని చెప్పాలి. తమ వారసులను పొగడడం అందరూ చేసేదే. కానీ ఇతర హీరోలను, ఇతర వంశం నుంచి వచ్చిన హీరోలను పొగడడం నాగార్జున ఒక్కడే చేయగలడు. అది కూడా తన కొడుకు అఖిల్ సక్సెస్ మీట్ లో మరో హీరోని ప్రశంసించడమంటే మామూలు విషయం కాదు.
అఖిల్ ని సక్సెస్ చేసిన ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పేందుకు నాగార్జున ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. కొత్తగా వచ్చిన హీరో అయినా సరే.. చాలా బాగా చేశాడంటూ అఖిల్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు. అదే సమయంలో కొత్తగా వచ్చిన వారిలో ఎవరు బాగా చేసినా పొగుడుతానన్న నాగార్జున.. రీసెంట్ గా కంచె మూవీ చూసినట్లు చెప్పాడు. నాగబాబు గారి అబ్బాయ్ సూపర్ అన్న నాగ్.. 'ఎంత బాగా చేశాడు.. ఫెంటాస్టిక్, ఆర్మీ సోల్జర్ లాగా ఆ టైంలోకి వెళ్లిపోయాడు, 1947 ని గుర్తు చేశాడు' అంటూ వరుణ్ తేజ్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు.
సీనియర్ హీరోల్లో ఇంత ఓపెన్ గా మాట్లాడేది నాగ్ ఒక్కడే అని చెప్పాలి. ఈ తరం హీరోల్లో అయితే.. రామ్ చరణ్ ఇలాగే మాట్లాడుతుంటాడు. ఎవరు సక్సెస్ సాధించినా తనే ఫోన్ చేసి అభినందనలు తెలుపుతాడు. మంచి మెసేజ్ తో శ్రీమంతుడు సక్సెస్ సాధించినపుడు.. సూపర్ స్టార్ మహేష్ బాబును ఇలాగే ప్రశంసించాడు మెగా పవర్ స్టార్. మన టాలీవుడ్ లోనూ.. ఇతర క్యాంప్ హీరోలను ప్రశంసించే కల్చర్ మొదలుకావడం సంతోషించదగ్గ విషయమే.