మొన్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో మాంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాడు అక్కినేని నాగార్జున. ఇప్పుడిక గుండెలు పిండేయడానికి రెడీ అవుతున్నాడు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ఎమోషనల్ డ్రామా ‘ఊపిరి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఫస్ట్ కాపీ కూడా రెడీ చేసేసిన ‘ఊపిరి’ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. ఆల్రెడీ తమిళంలో సెన్సార్ అయిపోయింది. ఆడియో రిలీజ్ చేసేశారు. ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. మరోవైపు తెలుగులోనూ సందడి మొదలైపోయింది. ఇవాళ తమన్నా చేతుల మీదుగా ‘ఊపిరి’లోని ఓ పాటను లాంచ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ లో ఆడియో వేడుక కూడా జరగబోతోంది.
ఇక ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ.. ఇటీవలే ఫైనల్ కట్ చూసుకున్నామని, సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదని.. చాలా ఉద్వేగానికి గురయ్యానని చెప్పాడు. సినిమా మీద చాలా కాన్ఫిడెంటుగా ఉన్నామని.. తన ఖాతాలో మరో హిట్టు పడబోతోందని చెప్పాడు. టీజర్ - పోస్టర్లు చూస్తున్నా కూడా ‘ఊపిరి’ మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న సంగతి అర్థమవుతోంది. ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’కు రీమేక్ గా వస్తున్న సినిమా ఇది. ఒరిజినల్ లో ఎమోషన్లు అద్భుతంగా పండాయి. వంశీ పైడిపల్లి మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి బాగానే తీర్చిదిద్దినట్లున్నాడు. మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.