హీరోయిన్‌పై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు!

తాజాగా ఒక సినిమా ఈవెంట్‌లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. హీరోయిన్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎక్కువ శాతం మంది సరదాగా తీసుకుంటే కొందరు మాత్రం ఆ మాటలను వివాదాస్పదం చేస్తున్నారు.;

Update: 2025-03-29 07:18 GMT
హీరోయిన్‌పై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొన్ని సినిమాల ప్రమోషనల్‌ ఈవెంట్స్ ఈమధ్య కాలంలో మల్లారెడ్డి కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరగడం మనం చూస్తూ ఉన్నాం. యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో చాలా వరకు మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన విషయం తెల్సిందే. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం ఆయా సినిమా వేడుకలకు హాజరు అవుతూ ఉంటాడు. మల్లారెడ్డి సోషల్‌ మీడియాలో బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రెటీ అనే విషయం తెల్సిందే. ఆయన సినిమా గురించి మాట్లాడితే తప్పకుండా మంచి పబ్లిసిటీ దక్కుతుందని భావించే వారు ఉన్నారు. అందుకే ఆయనను తీసుకుని వచ్చి మరీ తమ సినిమాల గురించి మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి.

రాజకీయాల గురించే కాకుండా సినిమాల గురించి తనదైన స్టైల్‌లో మల్లారెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా ఒక సినిమా ఈవెంట్‌లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. హీరోయిన్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎక్కువ శాతం మంది సరదాగా తీసుకుంటే కొందరు మాత్రం ఆ మాటలను వివాదాస్పదం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యే అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడటంతో యూత్‌కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే మల్లారెడ్డి పై కేసు నమోదు చేయాల్సిందే అంటూ కొందరు కామెంట్ చేస్తే మరికొందరు మాత్రం ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇదేం పద్దతి అంటున్నారు.

శ్రీ హర్ష హీరోగా పవన్‌ కేతరాజు దర్శకత్వం వహించిన 'లవ్‌ యువర్‌ ఫాదర్‌' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఆ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ హీరోయిన్‌ పేరు కశికా కపూర్‌ అంటా... చూడ్డానికి కసి కసికా ఉంది అన్నాడు. హీరో మా కాలేజ్‌లో చదువుకున్నాడు, ఇక్కడ చదువుకుని ఇక్కడే తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. సినిమాను చక్కగా తీసినందుకు గాను దర్శకుడికి అభినందనలు. ఈ సినిమా హీరో మా కాలేజ్ ప్రిన్సిపల్‌ కొడుకు. అందుకే అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పుకొచ్చాడు.

మల్లారెడ్డి ఏం మాట్లాడినా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటుంది. ఈ సినిమా వేడుకలోనూ అదే విధంగా మాట్లాడాడు. అయితే ఈసారి ఆయన ఒక లేడీ గురించి తప్పుగా మాట్లాడటం వల్ల వివాదాస్పదం అయింది. మల్లారెడ్డి స్టైల్‌, ఆయన మాట తీరుకు కసి కసిగా హీరోయిన్‌ ఉంది అనే వ్యాఖ్యలు పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది కొందరి అభిప్రాయం. ఈమధ్య కాలంలో స్టేజ్‌ మీద కొందరు నోరు జారడం మనం కామన్‌గా చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య రాబిన్‌హుడ్‌ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ డేవిడ్‌ వార్నర్‌ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ సినిమా వేడుకలో మల్లారెడ్డి హీరోయిన్‌ కసిగా ఉందంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. తన వ్యాఖ్యలకు రాజేంద్ర ప్రసాద్‌ క్షమాపణ చెప్పాడు, మరి మల్లారెడ్డి క్షమాపణ చెప్తాడా అనేది చూడాలి.


Full View


Tags:    

Similar News