వేంకటేశ్వరుడితో నాగ్ అనుబంధం.. అదిరే

Update: 2017-01-09 04:33 GMT
ఒక ఆథ్యాత్మిక సినిమా తీసినప్పుడు.. దాని తాలూకు ఆడియో ఫంక్షన్ కూడా ఆధ్యాత్మికంగానే జరగాలి. అందుకే నాగార్జున్ మెయిన్ లీడ్లో రూపొందిన హాథీ రామ్ బాబా జీవిత చరిత్ర ''ఓం నమో వేంకటేశాయ'' ఆడియో ఈవెంట్ ను వేదమంత్రాల సాక్షిగా.. వేద పండితుల నడుమ జరిపారు. ఈ సందర్భంగా ఆ వడ్డీకాసుల వాడితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు నాగ్. ఆ కలియుగ దైవం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

ఆ ఏడు కొండల వేంకటేశ్వరుడితో తన అనుబంధాన్ని పంచుకుంటూ.. ''చిన్నప్పుడు మా అమ్మ తొలిసారిగా నన్ను వేంకటేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళింది. నాన్నగారికి ఇష్టం లేకపోయినా.. మేం పూజలు అవీ చేస్తే ఏమీ అనేవారు కాదు. అలా నాకు వేంకటేశ్వరుడితో అనుబంధం పెరిగింది. కాని తొలిసారిగా ఆయన్ను.. అమ్మ హెల్త్ పరంగా బాధలు పడుతుంటే.. తీసుకెళ్లిపో స్వామి.. నీ దగ్గరకు పిలిచెయ్ అంటూ కోరుకున్నా. వెంటనే ఆయన నా కోరిక తీర్చాడు. ఆ తరువాత మళ్లీ 'మనం' సినిమా బాగా ఆడాలని.. అది నాన్నగారి ఆఖరి సినిమా కాబట్టి సూపర్ హిట్ కావాలని కోరుకున్నాను. ఆ కోరికను కూడా ఆయన మన్నించాడు. ఇక కోర్కెల చిట్టా పెరుగుతూనే ఉంటుందిగా.. మొన్నొక సారి నా పిల్లలను కూడా బాగా చూస్కోమని కోరుకున్నా. ఆ రోజు నేను తిరుపతిలోనే ఉన్నా.. అప్పుడే వీళ్లద్దరి పెళ్లి మేటర్ తెలిసింది. నెల రోజుల్లో పెళ్లిళ్ళు సెట్టయిపోయాయ్. ఇక అమలను ఎప్పుడైనా తిరుపతి వెళ్తున్నా వస్తావా అంటే.. నన్ను ఆయన రమ్మనలేదు నువ్వెళ్లొచ్చెయ్ అంటుంటుంది'' అని చెప్పారు కింగ్ నాగార్జున.

ఇక నమో వేంకటేశాయ సినిమాలో పని చేసిన టెక్నీషియన్లకు అందరికీ థ్యాంక్స్ చెబుతూ.. ఇదే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆఖరి సినిమా అని.. అందుకే ఈ సినిమా బాగా ఆడాలని ఆ తిరుపతి వెంకన్నను మరోసారి వేడుకుంటున్నట్లు తెలిపారు నాగార్జున.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News