కోర్టు మెట్లు ఎక్కిన హాట్ బ్యూటీ

Update: 2017-01-05 05:07 GMT
తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా.. అందరిని ఆకర్షించిన అందం నమితది. సన్నజాజి మొగ్గలా ఉండే ఆమె.. తర్వాతి కాలంలో బొండు మల్లెలా తయారు కావటం.. టాలీవుడ్ ను వదిలేసి కోలీవుడ్ లో సెటిల్ కావటం తెలిసిందే. నమిత మీద తమిళుల అభిమానం ఎంతవరకు వెళ్లిందంటే.. ఆమెకు ప్రత్యేకంగా గుడి కూడా కట్టేశారు. అలాంటి నమిత ఇప్పుడు ఇంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నారట.

సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ప్రస్తుతం పాలక అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. చెన్నైలోని నివసించే ఆమె ఇంటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఆమె ఇంటి యజమాని తనను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు.  ప్రతి నెలా తాను రూ.15వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నా.. కచ్ఛితంగా ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

డిసెంబరు31 నాటికి ఇంటిని ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి తెచ్చారని.. ఇబ్బందికి గురి చేస్తున్నారని.. తనను వేధిస్తున్నారని ఆమె చెన్నైలోని 13వ అసిస్టెంట్ సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ నెల12 వరకు ఆ ఇంట్లోనే ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కోట్ల మంది మదిని దోచిన భామకు ఈ తరహా ఇంటి కష్టాలేంటో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News