హీరోలను దేవుళ్లుగా అభిమానించడం అనే ట్రెండ్.. మన దగ్గర చాలా కాలం నుంచే ఉంది. హీరోల మీద ఉన్న ప్రేమాభిమానాలతో పదిమందికీ మంచి జరిగేలా కార్యక్రమాలు చేపట్టే ఫ్యాన్స్ కూడా ఉంటారు. అందరి హీరోల ఫ్యాన్స్ లోనూ ఇలాంటి మంచి లక్షణాలు కనిపిస్తాయి. అయితే.. కొంత మంది మాత్రం తమ అనైతిక చర్యలకు అభిమాన సంఘాలు అనే ముసుగు తగిలించేసుకుంటూ ఉంటారు.
తన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై.. బాలకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిపారు అభిమానులు. అయితే.. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల ప్రాంతంలో మాత్రం కొందరు కుర్రాళ్లు చేసిన హంగామా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. నందమూరి యువసేన పేరుతో.. కార్లు బైకులతో ర్యాలీ చేసిన వీరు హైవే అంతా రచ్చ రచ్చ చేసేశారు. రోడ్లపైనే మద్యాన్ని సేవించడం.. నడిరోడ్డుపై వాహనాలను అడ్డంగా ఆపేసి.. ఇబ్బందులు కలిగించడం.. ఫ్యాన్స్ ఎలా ప్రవర్తించకూడదు అనేందుకు ఎగ్జాంపుల్ గా నిలిచారు.
చివరకు రోడ్ రిపెయిర్ పనుల కోసం వర్కర్స్ ఏర్పాటు చేసుకున్న ప్లాస్టిక్ కోన్స్ ను నాశనం చేసేందుకు వెనకాడలేదు. నందమూరి యువసేన ఈ తరహా ప్రవర్తనపై ఆ కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే.. ఈ కేసు నమోదు కాలేదని.. నేషనల్ హైవేస్ అధికారులు కేసు పెట్టవద్దని సూచించారని టాక్ వినిపిస్తోంది.