స‌రైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కన్నడ బ్యూటీ..!

Update: 2021-01-03 03:30 GMT
'నందా లవ్స్ నందిత' అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందిత శ్వేత.. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'ప్రేమ కథా చిత్రమ్ 2' 'అభినేత్రి 2' లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టింది. ఈ క్రమంలో 'శ్రీనివాస కళ్యాణం' 'బ్లఫ్ మాస్టర్' 'సెవెన్' 'కల్కి' వంటి చిత్రాల్లో నటించింది. అలానే హారర్ - సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో 'ఐపీసీ 376' అనే సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇక తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న కన్నడ రీమేక్ 'క‌ప‌ట‌ధారి' లో నటిస్తోంది. వీటితోపాటు 'అక్షర' అనే చిత్రం చేస్తోంది.

క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ ఇండస్ట్రీలలో సూప‌ర్ హిట్స్ అందుకున్నా ఎందుక‌నో అవ‌కాశాలు మాత్రం అర‌కొర‌గానే వ‌స్తున్నాయి. స‌రైన బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఒక్క‌టి వ‌చ్చినా నందిత శ్వేత త‌న‌ని తాను ప్రూవ్ చేసుకోవ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతోంది. ప్రస్తుతం అమ్మడు నటిస్తున్న సినిమాలు హిట్ ఐతే మళ్ళీ పుంజుకొని అవ‌కాశాలు తెచ్చుకోవాల‌ని చూస్తోంది. ఈ బ్యూటీ అప్ క‌మింగ్ మూవీ ''అక్ష‌ర'' థియేట‌ర్స్ లో ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల అవుతుంద‌ట‌. లేడీ ఓరియెంటెట్ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో నందిత ఫుల్ గ్లామ‌ర్ అవ‌తార్ లో క‌నిపించ‌బోతోందని అంటున్నారు. మరి శ్వేత నటించిన ఈ సినిమాలు మంచి విజయం సాధించి అమ్మడి కెరీర్ ని గాడిలో పెడతాయేమో చూడాలి.
Tags:    

Similar News