నాని దెబ్బకు బన్నీ ఔట్

Update: 2017-07-10 07:05 GMT
అసలే ‘దువ్వాడ జగన్నాథం’ బండి కష్టం మీద నడుస్తోంది. తొలి వారాంతంలో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి కానీ.. తర్వాత సినిమాకు ఆశించిన కలెక్షన్లు రాలేదు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో తొలి నాలుగు వీకెండ్లోనే 70 శాతం దాకా బయ్యర్ల పెట్టుబడులు రికవరీ అయిపోవడంతో నష్టాలు అనుకున్నంత స్థాయిలో ఉండవని అర్థమైంది. ఆరంభ శూరత్వం చూసి బయ్యర్లు లాభాలు కూడా ఆశించారు.

కానీ తర్వాత వాళ్ల ఆలోచన మారిపోయింది. పెట్టుబడి తిరిగి వస్తే చాలనుకున్నారు. ఐతే కొన్ని చోట్ల బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చారు కానీ.. కొన్ని చోట్ల మాత్రం స్వల్ప నష్టాలు తప్పలేదు. సెకండ్ వీకెండ్లో ఓ మోస్తరుగా ఉన్న వసూళ్లు తర్వాత బాగా డ్రాప్ అయ్యాయి. దీనికి తోడు నాని సినిమా ‘నిన్ను కోరి’ మంచి టాక్ తో మొదలైంది. దీంతో ‘డీజే’కు పంచ్ పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇప్పుడు నామమాత్రంగా నడుస్తోంది. దీంతో పోలిస్తే అంతకంటే ముందు విడుదలైన  ‘అమీతుమీ’ పరిస్థితే మెరుగ్గా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అమెరికాలో ‘డీజే’ను ‘నిన్ను కోరి’ కొట్టిన దెబ్బ పెద్దది. 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప హిట్ కేటగిరిలోకి చేరని పరిస్థితి ‘డీజే’ది. కానీ ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లను కూడా అందుకోదని స్పష్టమైపోయింది. 1.2-1.3 మిలియన్ డాలర్ల మధ్య ‘డీజే’ ఫైనల్ కలెక్షన్లు ఉంటాయని అంచనా. బయ్యర్ కు రూ.4 కోట్ల దాకా నష్టమని అంటున్నారు. సెకండ్ వీకెండ్లో బన్నీతో పాటు ‘డీజే’ టీం అంతా వచ్చి ప్రమోట్ చేసినా ఫలితం లేకపోయింది. మూడో వారాంతం వసూళ్లపై పెట్టుకున్న ఆశల్ని ‘నిన్ను కోరి’ తుంచేసింది. నాని సినిమా దెబ్బకు ‘డీజే’ వాషౌట్ అయిపోయింది. యుఎస్ టాలీవుడ్ బాక్సాఫీస్ ను నాని పూర్తిగా ఆక్రమించేశాడు. ‘నిన్ను కోరి’కి అక్కడ వసూళ్ల వర్షం కురుస్తోంది.
Tags:    

Similar News