హైదరాబాద్ లో 'సైమా' అవార్డుల సందడి కొనసాగుతోంది. వివిధ భాషలకి చెందిన తారలు తళుక్కున మెరుస్తున్నారు. 2019- 20 సంవత్సరాలకి గాను విజేతలను ప్రకటించగా, అందుకు సంబంధించిన హడావిడి కనిపిస్తోంది. 2019లో వచ్చిన 'ఓ బేబీ' సినిమాకి గాను 'ఉత్తమ నటి'గా సమంత ఎంపిక అయింది. 'ఓ బేబీ' .. 'మిస్ గ్రానీ' అనే ఓ కొరియన్ సినిమాకి రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ వారి నిర్మాణ భాగస్వామ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందించాడు.
జీవితంలో వృద్ధాప్యం .. ఒంటరితనం చాలా భయంకరమైనవిగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఒంటరితనాన్ని ఓడించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎవరెవరి కోసమో ఎన్నో త్యాగాలు చేస్తూ కాలాన్ని చాలా వృథా చేశామే అనిపిస్తుంది. మళ్లీ వయసనేది వస్తే ఆ జీవితాన్ని ఇంకా ఎంతో సరదాగా .. సందడిగా గడపాలని అనిపిస్తుంది. అన్ని అవసరాలు తీరిపోయిన తరువాత అందరూ దూరం పెట్టినప్పటికీ, వాళ్ల కోసం ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది అనే విషయాన్ని చాటిచెప్పిన సినిమా ఇది. జీవితంలో అందరికీ ఎదురయ్యే అనుభవమే ఈ కథ కావడంతో వెంటనే కనెక్ట్ అయింది.
వృద్ధురాలి పాత్రలో లక్ష్మి కనిపిస్తే .. యవ్వనాన్ని పొందిన ఆ పాత్రలో సమంత మెరిసింది. ఈ కథను నడిపించిన ప్రధానమైన పాత్రలు ఈ రెండే. ఇక రావు రమేశ్ .. రాజేంద్ర ప్రసాద్ పాత్రలు కీలకమైనవిగా కనిపిస్తాయి. ఈ సినిమాలో వైవిధ్యభరితమైన తన పాత్రను సమంత అద్భుతంగా చేసింది. అందువల్లనే ఆమెను ఈ అవార్డు వరించింది. అయితే చెన్నై లో ఉన్న కారణంగా సమంత ఈ అవార్డును స్వయంగా అందుకోలేకపోయింది. ఆమె తరఫున నాని ఈ అవార్డును తీసుకున్నాడు.
అందుకు సమంత తనదైన అల్లరితనంతోనే స్పందించింది. "థ్యాంక్యూ నానీ నా బదులుగా అవార్డు తీసుకున్నందుకు. 'ఉత్తమనటి' అవార్డును తీసుకుంటానని ఎప్పుడైనా అనుకున్నావా? అంటూ సరదాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఆటపట్టించింది. 'జెర్సీ' సినిమాకిగాను అవార్డు అందుకున్న నానీకి అభినందనలు తెలియజేసింది. సమంతలోని ఈ చిలితనం .. అల్లరితనం .. సమయస్ఫూర్తి కారణంగానే ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.