తెలుగులో మంచి బేస్ వాయిస్ ఉన్న యువ కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు. రోహిత్ సినిమాల్లో డైలాగులు బాగా ఎలివేట్ కావడానికి అతడి వాయిస్ కూడా ఒక కారణం. రోహిత్ కు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని అప్పుడప్పుడూ వేరే సినిమాల వాళ్లు కూడా అతడి మాట సాయం తీసుకుంటూ ఉంటారు. తాజాగా ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాకు రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ సినిమాలో కథను మొదలుపెట్టేది అతడే.
ఐతే ఇలా మనోజ్‌కు సాయం చేసిన రోహిత్.. తన సినిమాకు మాత్రం వేరొకరి సాయం తీసుకుంటున్నాడు. సీనియర్ హీరో జగపతిబాబు.. రోహిత్ కొత్త సినిమా ‘బాలకృష్ణుడు’కు వాయిస్ ఓవర్ ఇవ్వబోతుండటం విశేషం. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా కోసం జగపతి ఆల్రెడీ వాయిస్ ఓవర్ పని పూర్తి చేశాడు. ‘బాలకృష్ణుడు’ లాంటి కమర్షియల్ సినిమాకు జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరమేంటో సినిమాలోనే చూడాలి.
నారా రోహిత్ తో కలిసి జగపతిబాబు ‘ఆటగాళ్ళు’ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి పరుచూరి మురళి దర్శకుడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణుడు విషయానికి వస్తే ఈ చిత్రంతో పవన్ మల్లెల దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేసింది.