ఈ మధ్య హీరో అందాల రాముడు.. ఆరడుగుల అజాను బాహుడంటే ఎవరూ పట్ట్టించుకోవడం లేదు. జనాల్లో నుంచి వచ్చిన వాడు.. ఊర మాస్ లుక్ తో రియలిస్టిక్ గా కనిపించే వాడైతే.. అలాంటి కథలతో వస్తే ప్రేక్షకులు అమితంగా ఇష్టపడటమే కాకుండా ఆ తరహా కథలకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో చాలా వరకు ఈ మధ్య వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ లు గా నిలవడమే కాకుండా సదరు హీరోలకు పాన్ ఇండియా స్టార్ లుగా గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
దీంతో ఇదే సరికొత్త ట్రెండ్ గా మారి ఊరమాస్ లుక్కు.. బ్లాక్ బస్టర్ కిక్కుగా మారిపోయింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. ఈ మూవీలో రామ్ చరణ్ ఊరమాస్ పాత్రలో గళ్ల లుంగీ, మాసిన గడ్డంతో చిట్టిబాబు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. తొలి సారి చరణ్ అలా మాసీవ్ లుక్ లో పక్కగా గ్రామీణ యువకుడిగా కనిపించడం.. కథ, కథనాలు ఆసక్తికరంగా వుండటంతో ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ లుక్ కి మరింత రగ్గ్డ్ టచ్ ఇస్తూ `కేజీఎఫ్ చాప్టర్ 1`లో కన్నడ స్టార్ యష్ గని కార్మికుడిగా రఫ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఈ తరహా క్యారెక్టర్ల ట్రెండ్ మరీ ఎక్కువైంది. ఆ తరువాత ఇదే ఫార్ములాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫాలో అయ్యాడు. `పుష్ప`లో బన్నీ గంధపు చెక్కలు నరికే కూలోడిగా మాసిన గడ్డం. గళ్ల లుంగీలో రస్టిక్ లుక్ లో కనిపించి తనదైన స్టైల్లో ఆకట్టుకోవడమే కాకుండా ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయాడు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మూవీకి ప్రస్తుతం సీక్వెల్ చేస్తున్నారు. `పుష్ప 2` పేరుతో రూపొందనున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఫస్ట్ పార్ట్ లో లుక్, మేనరిజమ్స్ సినిమా విజయానికి ప్రధాన భూమిక పోషించడంతో ఇటీవలే `పుష్ప 2` కోసం ప్రత్యేకంగా లుక్ టెస్ట్ ని పూర్తి చేశారు. అక్టోబర్ 10 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ భారీ స్థాయిలో ప్రారంభం కాబోతోంది. ఇందులోనూ బన్నీ మాసీవ్ అవతార్ లో కనిపించబోతున్నారు.
ఇక `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా `సలార్` ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ రగ్గ్డ్ లుక్ లో పూర్తి మాసీవ్ అవతార్ లో కనిపించబోతున్నడని ఇప్పటి వరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో స్పష్టమైంది. ఇప్పడు ఇదే పంథాని నేచురల్ స్టార్ నాని కూడా ఫాలో అవుతున్నాడు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా `దసరా`. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీలో నాని బొగ్గు గని కార్మికుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే.
శనివారం విడుదల చేసిన నాని లుక్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఊర మాసీవ్ అవతార్ లో ఒంటినిండా మసితో నాని రస్టిక్ లుక్ లో పక్క పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నారు. ఇంత వరకు క్లాస్ లుక్ లో కనిపించిన నాని ఒక్కసారిగా `దసరా` కోసం రస్టిక్ లుక్ లో ఊరమాసీవ్ అవతార్ లోకి మారిపోవడం ఆకట్టుకుంటోంది. నాని నటిస్తున్న `దసరా` 2023,మార్చి 30న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. అందిలాగే నాని కూడా రస్టిక్ లుక్ బ్లాక్ బస్టర్ కిక్కుని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.