సౌత్ బ్యూటీ నయనతార గత మూడేళ్లుగా చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతోంది. ఫ్లాప్ దరి చేరకుండా కెరీర్ కొనసాగిస్తున్న ఈ భామకు.. ఇప్పుడు తిరునాళ్ రూపంలో ఫెయిల్యూర్ ఎదురైంది. తను ఎంతో మనసుపెట్టి చేసిన మూవీ ఫ్లాప్ అనిపించుకోవడమే నయన్ కు చిరాకు తెప్పిస్తే.. ఇప్పుడా సినిమాలో ఓ సీన్ ఈ భామను కాంట్రవర్సీలో పడేసింది.
తిరునాళ్ లో ఓ సీన్ లో ఓ చిన్న పిల్లాడితో నయనతారకు లిప్ లాక్ ఉంటుంది. స్కూల్ పిల్లలకు గిఫ్టులు ఇస్తూ.. వారిని తన బుగ్గపై ముద్దు పెట్టమని చెబుతూ ఉంటుంది నయన్. అందరూ బాగానే ఇస్తారు కానీ.. ఓ కొంటె కుర్రాడు మాత్రం ఏకంగా నయన్ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని పెదాలకు పెదాలు ఆనించి ముద్దు పెట్టేస్తాడు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదం అయిపోయింది. మహిళా సంఘాలు.. చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు విరుచుకుపడిపోతున్నారు. వెంటనే ఆ సినిమాలోని ఈ సీన్ ని తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ సీన్ పై నయన్ వెర్షన్ వేరేగా ఉంది. ఆ కుర్రాడు అలా చేస్తాడని తనకు ముందు తెలియదని అంటోందీ భామ. ఈ వివాదం కారణంగా.. ఇప్పటివరకూ తిరునాళ్ ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు చాలామందిలో ఆసక్తి జనరేట్ అయింది.
Full View