నయన్ సెంచరీ కొట్టేయడం ఖాయమే

Update: 2016-11-15 22:49 GMT
సౌత్ బ్యూటీ నయన తార.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్. సినిమాలు చేయడంలో ఈమె చూపించే స్పీడ్ కానీ.. అంత స్పీడ్ లోనూ ఆమె చూపించే ప్రతిభ కానీ.. అందుకోవడం ఎవరివల్లా కావడం లేదు. 2003లో మలయాళ మూవీ మనసినక్కరే చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు 55వ సినిమా చేసేస్తోందంటే.. నయన్ స్పీడ్ ని తెలుసుకోవచ్చు.

తెలుగు.. తమిళ్.. మలయాళం.. కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది నయన్. కేరక్టర్ల ఎంపిక విషయంలో ఈమె చూపించే ప్రతిభ.. మిగిలిన హీరోయిన్స్ ఎవరికీ సాధ్యం కావడం లేదు. అటు సీనియర్ హీరోలతోను.. ఇటు కుర్రగ్యాంగ్ తోనూ నటించి మెప్పించేయగలగడం అమ్మడి స్పెషాలిటీ. రీసెంట్ గా బాబు బంగారం చిత్రంలో వెంకీ సరసన హీరోయిన్ గా నటించి.. తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన నయన్.. 100 సినిమాలు చేసేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇప్పుడు టాప్ హీరోయిన్ కావడం.. కనీసం ఐదారేళ్లు కెరీర్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉండడంతో.. సెంచరీ మార్క్ ను అందుకోవడం ఈమెకు పెద్ద కష్టమేం కాదని అనుకోవచ్చు. పైగా.. మూవీలో తన వంతు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయడం తప్ప.. వేరే సంగతి పట్టించుకోని నయన్ కు.. కౌంట్ పెంచుకోవడం కష్టం కాదు. పబ్లిసిటీ.. ప్రచారం.. ప్రమోషన్స్ లాంటివి అసలు చేయదు కదా. ఆ టైమ్ లో కూడా ఇంకో సినిమా చేసేస్తుంటుందిలే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News