ఇక్కడ సినిమాలు హిట్టు.. అక్కడ సీరీస్ లు హిట్టు..!

ఐతే బాలీవుడ్ వెబ్ సీరీస్ లతో పోల్చితే తెలుగు వెబ్ సీరీస్ ల రీచింగ్ తక్కువే. అందుకే అవి అంతగా ఆడవని చెప్పొచ్చు.

Update: 2024-12-29 04:26 GMT

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు సాధిస్తున్న విజయాలు చూసి మన సినిమాలు ఆ రేంజ్ కి వెళ్తాయా లేదా అన్న డౌట్ ఉండేది. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు మన టైం కూడా వస్తుందని పెద్దలు చెప్పినట్టుగా నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాల హవా ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. ఒక దానికి మించి మరొకటి అనిపించేలా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది.

ఐతే సినిమాల పరంగా బాలీవుడ్ లెక్క తప్పుతుంది. అక్కడ స్టార్ సినిమాలు కూడా ఎందుకో సరైన సక్సెస్ లు అందుకోవట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే బాలీవుడ్ లో మహా అయితే ఒకటి రెండు తప్ప మిగతా సినిమాలు పెద్దగా ఆడట్లేదు. కానీ వెబ్ సీరీస్ లు మాత్రం అదరగొట్టేస్తున్నాయి. కోవిడ్ లాక్ డౌన్ టైం లో వెబ్ సీరీస్ లకు అలవాటు పడ్డ ఆడియన్స్ ఇంకా అదే ట్రాన్స్ లో ఉన్నారు. థియేటర్ కి వెళ్లి సినిమా చూసేందుకు జేబులు ఖాళీ చేసుకోవడం కన్నా ఓటీటీలో సీరీస్ లు చూడటం బెటర్ అని అనుకుంటున్నారు.

అందుకే అక్కడ సినిమాల కన్నా ఓటీటీలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. టాలీవుడ్ లో సినిమాలు హిట్లు కొట్టినంతగా వెబ్ సీరీస్ లు ఆకట్టుకోవట్లేదు. వాటికి సరైన ప్రమోషన్ దొరకట్లేదు అందుకే అవి అంతగా సక్సెస్ అవ్వట్లేదని అంటున్నారు. కానీ తెలుగు వెబ్ సీరీస్ లు కూడా కొన్ని సూపర్ హిట్ అయినవి ఉన్నాయి. వెబ్ సీరీస్ లకు కలెక్షన్స్ హంగామా ఉండదు కాబట్టే వాటి ఆదరణ ఏంటన్నది ప్రేక్షకులు గెస్ చేయడం కుదరదు.

ఐతే బాలీవుడ్ వెబ్ సీరీస్ లతో పోల్చితే తెలుగు వెబ్ సీరీస్ ల రీచింగ్ తక్కువే. అందుకే అవి అంతగా ఆడవని చెప్పొచ్చు. బాలీవుడ్ లో అయితే వెబ్ సీరీస్ వస్తుంది అంటే సినిమాల రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తారు. అక్కడ ఆడియన్స్ కూడా వెబ్ సీరీసే మొదటి ప్రాధాన్యత అన్నట్టుగా ఉన్నారు. అందుకే అక్కడ వెబ్ సీరీస్ లను బీట్ చేయడం ఎవరి వల్లా కావట్లేదు. బాలీవుడ్ తర్వాత వెబ్ సీరీస్ సక్సెస్ రేటులో కచ్చితంగా టాలీవుడ్ ఉందని చెప్పొచ్చు. ఐతే మన సినిమాల సక్సెస్ రేటు పొందుతున్న ప్రేక్షకాదరణ మరే ఇండస్ట్రీ పొందట్లేదని చెప్పడంలో సందేహం లేదు.

Tags:    

Similar News