శాతకర్ణి కోసం టాప్ టెక్నీషియన్

Update: 2016-07-16 11:20 GMT
బాలయ్య వందో సినిమా విషయంలో క్రిష్ అసలేమాత్రం రాజీ పడేలా లేడు. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ వసూలు చేసింది రూ.40 కోట్లే. కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బడ్జెట్ ఏకంగా రూ.70 కోట్లు. నటీనటులు.. టెక్నీషియన్స్ విషయంలో కానీ.. షూటింగ్ విషయంలో కానీ.. అసలేమాత్రం రాజీ కనిపించట్లేదు. ఆల్రెడీ ఈ సినిమాలో కబీర్ బేడీ లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్టు.. హేమమాలిని లాంటి అలనాటి అందాల తార నటిస్తున్నారు. టెక్నీషియన్స్ విషయంలోనూ ‘వరల్డ్ క్లాస్’ అయ్యుండేలా చూసుకుంటున్నాడు క్రిష్. యాక్షన్ సీక్వెన్స్.. విజువల్ ఎఫెక్టుల కోసం హాలీవుడ్ నిపుణుల సాయం తీసుకుంటున్న క్రిష్.. తాజాగా కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రముఖ బాలీవుడ్ టెక్నీషియన్ నీతా లుల్లాను ఎంచుకున్నాడు.

నీతా లుల్లా రేంజేంటని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఔట్ పుట్ ప్రపంచస్థాయిలో ఉంటుంది. బాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలకు పని చేసింది. తెలుగులో ఈ మధ్య ‘రుద్రమదేవి’కి వర్క్ చేసింది. అందులో ఆమె ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. క్రిష్ కూడా ఆమెనే ఎంచుకున్నాడు కాబట్టి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో కాస్ట్యూమ్ డిజైన్స్ టాప్ క్లాస్ లో ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు దుస్తులే కాకుండా ఆభరణాల బాధ్యత కూడా ఆమెదే. ఓ ప్రముఖ జువెలరీ బ్రాండ్ తో కలిసి ఆమె పని చేస్తోంది. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూడో షెడ్యూల్ జార్జియాలో జరుగుతోంది. అక్కడ క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు తీస్తున్నారు. త్వరలోనే యూనిట్ ఇండియాకు తిరిగి రానుంది.
Tags:    

Similar News