సుజిత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా 'సాహో' ఆగష్టు 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికేటీజర్ ట్రైలర్లు.. పాటలు రిలీజ్ చేసిన 'సాహో' టీమ్ తాజాగా 'సాహో' లో నటించే నటీనటుల క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేయడం ప్రారంభించింది.
అందులో భాగంగా మొదటి క్యారెక్టర్ పోస్టర్ అంటూ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ పోస్టర్ ను విడుదల చేశారు. తన మిస్టీరియస్ లుక్ తో ప్రేక్షకులను ను సస్పెన్స్ పెంచుతున్న నీల్ నితిన్ ముకేష్ అంటూ ఆయన పోస్టర్ ను బయటపెట్టారు. ఈ పోస్టర్ లో నీల్ నితిన్ ఒక లేత గోధుమ రంగు జాకెట్ ధరించి... కళ్ళకు గాగుల్స్ తో స్టైలిష్ గా ఉన్నాడు. నేపథ్యంలో సైఫై సినిమా నేపథ్యం తరహాలో డిజైన్ ఉంది. అంతా బాగానే ఉంది కానీ క్యారెక్టర్ పోస్టర్ తో పాటు క్యారెక్టర్ పేరు కూడా వెల్లడిస్తే బాగుండేది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన నీల్ నితిన్ ముకేష్ కు ఇది టాలీవుడ్ లో మొదటి చిత్రం.
'బాహుబలి' ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.