పాకిస్తాన్ జెండాతో పోజు.. తీవ్ర వివాదం!

Update: 2019-05-09 11:49 GMT
భారతదేశం మొత్తం మీద వివాదాలతో ఎప్పుడూ కాపురం చేసేవారి టాప్-10  లిస్టు తీస్తే అందులో రాఖి సావంత్ పేరు తప్పనిసరిగా ఉంటుంది.  ఇప్పుడు మరోసారి రాఖి వివాదానికి కేంద్రబిందువు అయింది.  నిన్న రాఖి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఆ ఫోటోలో ఒక వాగు దగ్గర నిలబడింది.  తనదైన స్టైల్ లో భారీ మేకప్ తో హాటుగా ఉంది. అయితే రాఖి పోజిచ్చింది పాకిస్తాన్ జెండాతో కావడంతో నెటిజనుల ఆగ్రహానికి గురయింది.

చాలామంది నెటిజనులు రాయలేని భాషలో తిట్టడం మొదలుపెట్టారు. కొందరు రాఖీని పాకిస్తానుకు వెళ్ళిపోమన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే రాఖి 'ధారా 370' అనే సినిమాలో నటిస్తోందట.  ఆ సినిమాలో రాఖీ పాకిస్తాన్ అమ్మాయి పాత్ర పోషిస్తోందని.. తెలిపింది.  ఈ సినిమా కాశ్మీర్ పండిట్లకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోందని చెప్పింది.  తనను ట్రోల్ చేస్తున్నవారికి ఒక వీడియోలో సమాధానం ఇస్తూ "నేను ఈ సినిమాలో పాకిస్తానీ అమ్మాయిలా నటిస్తున్నాను.  పాకిస్తాన్ ప్రజలకు కూడా మనసు ఉంటుంది. అందరూ చెడ్డవారు కాదు.  పిల్లలను దేశానికి వ్యతిరేకంగా జిహాద్ చెయ్యమని ప్రోత్సహించే  కొందరు.. అత్మాహుతి దళ సభ్యులను తయారుచేసేవారు చెడ్డవారు.  వాళ్ళు అల్లాకు వ్యతిరేకం.  వారు కాకుండా పాకిస్తాన్ లో ఉండే మిగతా వారిని నేను గౌరవిస్తాను." అంటూ తన వెర్షన్ వినిపించింది.

అయితే ఈ వివరణతో కొందరు నెటిజనులు శాంతించారు కానీ చాలామంది తమ మాటల దాడిని కొనసాగించారు. ఏదైతేనేం.. రాఖి సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 'ధారా 370' సినిమా ఎలా ఉంటుందో దేవుడెరుగు.. రాఖికి మాత్రం కావాలిసినంత ఫ్రీ పబ్లిసిటీ.


Tags:    

Similar News