'సలార్‌' కొత్త పుకారు.. ఇది కూడా అదరహో

Update: 2021-05-15 08:30 GMT
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా సలార్‌. కేజీఎఫ్‌ 2 విడుదలకు ముందే సలార్‌ ను ప్రశాంత్ నీల్‌ మొదలు పెట్టాడు. ఇప్పటికే బొగ్గు గనిలో మొదటి  షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్‌ షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆరంభం అయినప్పటి నుండి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ప్రతి పుకారు కూడా సినిమా స్థాయిని పెంచుతూనే ఉన్నాయి. ఈ సినిమా లోని ప్రభాస్ పాత్ర గురించి రకరకాలుగా పుకార్లు వినిపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా లో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సలార్‌ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండి వస్తున్న ప్రతి వార్త ఆహా.. అదరహో అన్నట్లుగా అనిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త ఒకటి సినిమా పై మరింత ఆసక్తిని పెంచే విధంగా వినిపిస్తుంది. ఈ కొత్త గాసిప్‌ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనేలా ప్రేక్షకులు ఎదురు చూసేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇంతకు ఆ కొత్త పుకారు ఏంటీ అంటే సలార్‌ లో ప్రభాస్‌ ఆర్మీ ఆఫీసర్‌ గా కనిపించబోతున్నాడని.. ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయని ఇప్పటి వరకు వచ్చిన ఆర్మీ ఆపరేషన్‌ సన్నివేశాలతో పోల్చితే ఇందులో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ విభిన్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడంటూ కొత్త పుకారు షికారు చేస్తోంది.

సలార్‌ సినిమా షూటింగ్‌ ను ఈ ఏడాది చివరకు పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని భావించారు. కాని కరోనా కారణంగా విడుదల తేదీ విషయంలో కాస్త అటు ఇటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సలార్‌ సినిమా లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్‌ నటిస్తోంది. ఇప్పటికే ఆమె కూడా కొన్ని సీన్స్‌ చిత్రీకరణ లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. సలార్‌ సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించేందుకు ప్రశాంత్ నీల్‌ హైదరాబాద్‌ లో సెట్స్‌ ను వేయిస్తున్నాడు. ఈ పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత షూటింగ్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News