పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` నేడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో టాక్ పాజిటివ్ గా ఉంది. జక్కన్న మరోసారి తనదైన మార్క్ ఎమోషన్ తో ప్రేక్షకుల్ని థియేటర్ లో లాక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సెంటిమెంట్ తోనే సినిమాని సగం సక్సెస్ చేసేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమా కి పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. చరణ్..తారక్..జక్కన్న క్రేజీ కంబినేషన్ కావడంతో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది.
ఆ లెక్కలు ఎక్కడా ఇంకా బయటకు రాలేదుగానీ బిజినెస్ మాట మాత్రం వాస్తవం. సినిమాకొస్తున్న పాజిటివ్ టాక్ నేపథ్యంలో అన్ని ఏరియాల్లోనూ సునాయాసంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని నమ్మకాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియాలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రికార్డునే బ్రేక్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. నైజాం రీజియన్ లో పవన్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో పవన్ క్రేజ్ అసాధారణం. ఏ తెలుగు హీరోకి లేని ఫాలోయింగ్ పవన్ కి నైజాంలో ఉంది.
నైజాంలో కేవలం పవన్ కి మాత్రమే డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే పవన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తొలి రోజు భారీ వసూళ్లు ఈ ఏరియా నుంచి కనిపిస్తాయి. ఇటీవల రిలీజ్ అయిన `భీమ్లా నాయక్` కూడా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని సాధించిన సంగతి తెలిసిందే. తొలి రోజు `భీమ్లా నాయక్` నైజాం షేర్ 11.80 కోట్లు. ఇప్పటివరకూ ఇదే హయ్యెస్ట్ రికార్డు. అయితే ఇప్పుడీ రికార్డుని `ఆర్ ఆర్ ఆర్` బ్రేక్ చేస్తుందని మీడియా కథనాలు అంతకంతకు హీటెక్కిస్తున్నాయి.
`ఆర్ ఆర్ఆర్` మొదటి రోజు నైజాంలో 24 కోట్లకు పైగా వసూళ్లని సాధిస్తుందని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇది సాధ్యం అవుతందా? లేదా? అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. ఒకవేళ రీచ్ అయితే గనుక ఈ రికార్డుని పవన్ సైతం బీట్ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పొచ్చు. అలాగే పవన్ క్రేజ్ ఇద్దరి స్టార్ హీరోలతో సమానమని భావించాల్సి ఉంటుంది.
ఇక `ఆర్ ఆర్ ఆర్` అమెరికాలోనూ ప్రీమియర్ షోలతోనే రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. 3 మిలియన్ డాలర్ల వసూళ్లతో భారతీయ తొలి చిత్రంంగా `ఆర్ ఆర్ ఆర్` నిలిచింది. 981 లొకేషన్స్ లో `ఆర్ ఆర్ ఆర్` ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇలా రెండు రకాలుగానూ `ఆర్ ఆర్ ఆర్` సంచలనం సృష్టించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..స్టార్ మేకర్ రాజమౌళి కాంబినేషన్ కావడంతోనే ఈ అరుదైన ఫీట్ సాధ్యమైంది.