కపూర్ వంశపు ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ పరిచయం అవసరం లేదు. నటిగా నిర్మాతగా వ్యాపారవేత్తగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచే సోనమ్ ఇటీవల తన ఫ్రెగ్నెన్సీని కూడా ప్రకటించారు. అయితే ఈ ఆనంద సమయంలో తన ఇంట దొంగతనం మోసం వంటి కేసులు కొంత కలతకు కారణమయ్యాయి. ఈ ఘటనలు అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఫిబ్రవరిలో నటి సోనమ్ కపూర్ ఆనంద్ అహూజా ఢిల్లీ నివాసంలో రూ. 2.4 కోట్ల విలువైన నగదు- నగలు చోరీకి గురైనట్లు పోలీసులు పత్రికా ప్రకటనలో తెలిపారు. దోపిడీ ఫిబ్రవరి 11న జరగగా ఘటన జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత ఫిబ్రవరి 23న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రకటనలో తెలిపారు. దీనిపై వెంటనే ఎఫ్ ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
హరీష్ అహుజా- అమృతా షెర్గిల్ మార్గ్ లో 23.02.22న ఫిర్యాదు అందింది. కొంత నగదు ఆభరణాలు కలిపి 2.4 కోట్ల విలువైన నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. దానిని 11.02.22న గమనించి ఫిర్యాదు చేశారు. 23.02.22న వెంటనే ఎఫ్ ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. తదుపరి విచారణ ప్రక్రియలో ఉంది అని పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
సోనమ్ కపూర్ ఇంట ఇది రెండో సంఘటన అని తెలిసింది. మార్చిలో అత్యంత వినూత్నమైన సైబర్ మోసంలో సోనమ్ బావ గారు రూ. 27 కోట్లకు పైగా మోసపోయారని పోలీసులు నివేదించారు. సోనమ్ కపూర్ మామగారైన హరీష్ అహుజా ఫరీదాబాద్ కు చెందిన షాహీ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీకి సంబంధించిన రిబేట్ ఆఫ్ స్టేట్ .. సెంట్రల్ టాక్స్ అండ్ లెవీస్ లైసెన్సులను అతని నకిలీ డిజిటల్ సంతకం ఆధారంగా దుర్వినియోగం చేసి మోసగించారని పోలీసులు తెలిపారు. సర్టిఫికేట్ అలాగే.. వాటిని ఎన్‌క్యాష్ చేయడం వంటి మోసం జరిగింది