ఫొటోటాక్‌ః మెగాస్టార్‌ తో చిన్నారి అన్నాచెల్లి

Update: 2021-04-03 06:30 GMT
మెగా స్టార్‌ చిరంజీవితో నాగబాబు పిల్లలు వరుణ్ మరియు నిహారికలకు మంచి బాండ్డింగ్‌ ఉంటుందనే విషయం తెల్సిందే. పెదనాన్న అయిన చిరంజీవిని నిహారిక డాడీ అంటూ పిలుస్తుంది. ఆ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో నిహారిక స్వయంగా వెళ్లడించింది. వరుణ్ తేజ్‌ కూడా పెదనాన్న చిరంజీవి అంటే చాలా గౌరవిస్తూ ఉంటాడు. సందర్బానుసారంగా పెదనాన్న చిరంజీవి గురించి సోషల్‌ మీడియా ద్వారా వీరిద్దరు మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా వరుణ్ తేజ్ ఈ ఫొటో ను షేర్‌ చేసి చిన్నప్పుడు పెదనాన్న చిరంజీవితో ఉన్న సన్నిహిత్యంను చెప్పుకొచ్చాడు.

నిహారిక మరియు వరుణ్‌ లు ఎంతో క్యూట్‌ గా ఉన్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. నిహారిక నటిగా కొన్ని సినిమాలు చేసింది. గత ఏడాది పెళ్లి చేసుకున్న నిహారిక నటనకు దూరం అవ్వలేదు. ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్ లో నటిస్తుంది. ఇక వరుణ్ తేజ్ టాలీవుడ్‌ లో మంచి హీరోగా దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమాతో పాటు గని సినిమాలో వరుణ్‌ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా మరి కొన్ని కూడా చర్చల దశలో ఉన్నాయి. మెగా అభిమానుల్లో కొందరు చిరంజీవి మరియు వరుణ్‌ తేజ్ లు కలిసి ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నెరవేరేనా చూడాలి.
Tags:    

Similar News