ఏడాది పైగా బాక్సుల్లో మూలిగిన కొరియర్ బాయ్ కళ్యాణ్... ఎట్టకేలకు ముహూర్తాలు పెట్టుకుంటున్నాడు. యామీ గౌతమ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఆడియోని ఆగస్ట్ 23న రిలీజ్ చేస్తున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్ గౌతమ్ మీనన్. ఎలాగూ ఆడియో ఫంక్షన్ కాబట్టి... ముందుగా పాటల గురించే చెప్పుకుందాం. ఈ సినిమా పాటలకి కార్తీక్ సంగీతం అందిస్తుండగా... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సందీప్ చౌతా ఇస్తున్నాడు. అయితే... ఇప్పుడు అనూప్ రూబెన్స్ పేరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా జాయిన్ అవడం విశేషం.
నితిన్ కి అనూప్ రూబెన్స్ అంటే బాగా గురి. డజన్ సూపర్ ఫ్లాప్స్ తర్వాత... ఇష్క్ మూవీ హిట్ అవడంలో... సాంగ్స్ చాలా కీలకం. తర్వాత గుండెజారి గల్లంతయిందే సంగతి కూడా అంతే. ఆ తర్వాత హార్ట్ అటాక్ లో అనూపే కావాలంటూ పట్టుబట్టి.. పూరీని కూడా ఒప్పించగలిగాడు. మధ్యలో వచ్చిన చిన్నదాన నీకోసం పరిస్థితి కూడా ఇదే. ఇప్పుడు కొరియర్ బాయ్ కి... అనూప్ కాకపోవడంతో, కాసిని పాటలు చేయించుకుని మరీ.. అనూప్ పేరు తెచ్చాడట. ఇకపోతే అఖిల్ సినిమాకు కూడా థమన్ ఉండగా మళ్ళీ అనూప్ ను కూడా మధ్యలో ఇరికించాడు మన కుర్రాడు.
నితిన్ సెంటిమెంట్ సూపర్ గా ఉంది కానీ... ప్రతీ మూవీలోనూ ఖచ్చితంగా నాకు నచ్చినోళ్లే ఉండాలంటే చాలా కష్టం. ఈ విషయాన్ని ఓ ప్రొడ్యూసర్ కూడా అయిన నితిన్ కి... ఈ విషయం తెలియడం లేదా.. తెలిసినా పట్టించుకోవడం లేదా... ఇలా అయితే... ఇక వేరే సంగీత దర్శకులు ఈ ఎనర్జిటిక్ హీరోకి దూరమయ్యే పరిస్థితి వచ్చేలాగుంది.