కరోనా సంగతేమో కానీ ఈ ఏడాది నితిన్ కు కల్సి వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే భీష్మ రూపంలో మంచి హిట్టు దక్కింది. ఓ నెల రోజులు విడుదల చెయ్యడం ఆలస్యం అయ్యి ఉంటే మాత్రం నితిన్ కు కష్టకాలం కంటిన్యూ అయ్యేది. అసలే వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నితిన్ కు 'భీష్మ' రిలీజ్ మరో పెద్ద సమస్యగా మారేది. అలా కాకుండా 'భీష్మ' సూపర్ హిట్ గా నిలవడంతో నితిన్ కు ఊరట లభించింది.
ప్రస్తుతం నితిన్ 'వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమా.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా మరో రెండు సినిమాలు 'అంధా ధున్'రీమేక్.. 'పవర్ పేట' లైన్లో ఉన్నాయి. వీటిలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పవర్ పేట' కు ఇప్పటికే రంగం సిద్ధం అయిందట. 'ఛల్ మోహన్ రంగా' తర్వాత నితిన్-కృష్ణ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇది. 'పవర్ పేట' రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా అని.. రెండు భాగాలుగా భారీ స్థాయిలో తెరకెక్కుతుందని సమాచారం. నితిన్ ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ అవతారంలో కనిపిస్తాడట.
ఈ సినిమాలో కీలక పాత్రలకు దర్శకుడు పవర్ఫుల్ నటులను ఎంచుకోవడం విశేషం. హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంచుకున్నారు. సత్యదేవ్.. రావు రమేష్ లను ఇతర కీలక పాత్రలకు ఎంచుకున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. శ్రేష్ఠ్ మూవీస్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.