టాలీవుడ్ లో హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూనే నిర్మాణ సంస్థలని రన్ చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నుంచి నితిన్ వరకు కొంత మంది క్రేజీ హీరోలు ప్రొడక్షన్ లోనూ తమ సత్తాని చాటుకుంటున్నారు. అయితే ఈ రేసులో నితిన్ ఫ్యామిలీ ముందు వరుసలో నిలుస్తూ తెలివిగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. నితిన్ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ కంపనీ శ్రేష్ట్ మూవీస్. ఈ బ్యానర్ పై నితిన్ తో సినిమాలు తీస్తూ వస్తోంది.
అయితే ఇటీవల తమ పంథాకు భిన్నంగా తెలివిగా అడుగులు వేస్తూ క్రేజీ అనువాది చిత్రాలని కూడా రిలీజ్ చేస్తూ భారీ లాభాల్ని సొంతం చేసుకుంటోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'విక్రమ్'. లోకేష్ కనగరాజ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ జూన్ లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది.
ఈ మూవీని తెలుగులో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ మూవీ ద్వారా నితిన్ తండ్రికి భారీ స్థాయి లాభాలు అందినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ లో వున్న నితిన్ ఫాదర్ ఎన్.
సుధాకర్ రెడ్డి తాజాగా మరో తమిళ సినిమా అనువాద హక్కుల్ని సొంతం చేసుకున్నారు. అదే ఆర్య నటించిన 'కెప్టెన్'. ఉభయ తెలుఉ రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల్ని దక్కించుకున్నారాయన. ఈ నెల 8న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
ఇదే ఊపులో మరో తమిళ సినిమా తెలుగు అనువాద హక్కుల్ని సొంతం చేసుకున్నారట. శింబు హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'వెందు తున్నిధాతు కాడు' తెలుగు థియేట్రికల్ హక్కుల్ని రీసెంట్ గా సొంతం చేసుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది. తమిళంలో ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడం, చాలా రోజుల తరువాత గౌతమ్ మీనన్ చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
నితిన్ ఫాదర్ సినిమాల లైనప్ చూసిన వాళ్లంతా నితిన్ తో చేసిన సినిమా పోతే పోయింది కానీ అనువాద చిత్రాలతో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి తెలివిగా అడుగులు వేస్తున్నారని కామెంట్ లు చేస్తున్నారు. నితిన్ హీరోగా ఎన్. సుధాకర్ రెడ్డి నిర్మించిన 'మాచర్ల నియోజక వర్గం' ఇటీవలే విడుదలై ఫ్లాప్ అనిపించుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.