పవర్ ప్యాక్డ్ 'మాచర్ల యాక్షన్ ధమ్కీ' తో అదరగొట్టిన నితిన్..!

Update: 2022-07-26 06:01 GMT
యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''మాచర్ల నియోజకవర్గం''. ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్ మరియు మూడు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'మాచర్ల యాక్షన్ ధమ్కీ' పేరుతో ఓ వీడియోని వదిలింది. 'మాచర్ల నియోజకవర్గం' అనేది ఒక పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ అని ఈ చిన్న యాక్షన్ సీక్వెన్స్ కట్ తెలియజేస్తోంది.

'మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు.. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం' అంటూ నితిన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ని ఈ వీడియోలో చూడొచ్చు.

పవర్ ఫుల్ డైలాగ్ తో పాటుగా అద్భుతమైన యాక్షన్ మరియు మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వచ్చిన ఈ 'మాచర్ల యాక్షన్ ధమ్కీ' టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో సిద్దార్థ్ రెడ్డిగా నితిన్ పాత్ర స్వభావాన్ని ఈ స్మాల్ వీడియోలో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. విలన్ సముద్రఖని ని కూడా ఇందులో గమనించవచ్చు.

యాక్షన్ ధమ్కీ సృష్టించిన మాస్ మానియా నుండి ప్రేక్షకులు బయటకు రాకముందే.. ఈ నెల 30న గుంటూరులో జరిగే భారీ పబ్లిక్ ఈవెంట్ లో 'మాచర్ల నియోజకవర్గం' థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు 'నేను సిద్ధం.. మరి మీరు?' అని నితిన్ ట్వీట్ చేశారు

'మాచర్ల నియోజవర్గం' సినిమాతో ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి మరియు నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి - కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటించగా.. అంజలి 'రారా రెడ్డి' అనే స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మామిడాల తిరుపతి డైలాగ్స్ రాసారు. వెంకట్ - రవివర్మ - అనల్ అరసు సినిమాలో యాక్షన్ డిజైన్ చేసారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

'మాచర్ల నియోజకవర్గం' చిత్రాన్ని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇండిపెండెన్స్ వీక్ ని క్యాష్ చేసుకుని నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Full View

Tags:    

Similar News