అందం ప్రతిభ ఉన్నా అదృష్టం కలిసి రావాలి. ఈరోజు ఉన్నది రేపు ఉండదు.. రేపు ఉన్నది ఆ తర్వాత ఉండదు. ఎన్ని ఉన్నా రంగుల ప్రపంచంలో ఆశించిన స్టార్ డమ్ దక్కదు. వింతైన ప్రపంచం ఇది. ఈ కేటగిరీ లో పరిశీలిస్తే మెహ్రీన్ కౌర్ లో అన్నీ ఉన్నా ఏదీ కలిసి రావడం లేదు. రాజా ది గ్రేట్.. ఎఫ్-2 సక్సెస్ అవ్వకపోతే ఈ అమ్మడి సీన్ ఎలా ఉండేదో! తను నటించిన తొలి సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాథ కు మంచి రివ్యూలు వచ్చినా... కమర్శియల్ సక్సెస్ అవ్వలేదు. కొన్ని ఫ్లాపుల తర్వాత 2018లో ఎఫ్ 2 రూపంలో ఒక్క హిట్టు దక్కింది. ఎఫ్-2 లో మెహరీన్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. దీంతో హనీ పేరు తో బోయ్స్ లో నోటెడ్ అయ్యింది. ఆ వెంటనే చాణక్య బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడం తనకు పెద్ద మైనస్ అయ్యింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన `ఎంత మంచి వాడవురా` పెదవి విరుపులకు గురైంది. ఈ సినిమా వల్లా తనకు కలిసొచ్చిందేం లేదు. వరుసగా రెండో పరాజయంతో మోహరీన్ పూర్తిగా డైలమా లో పడింది. కెరీర్ ఇక కష్టమేనన్న మాటా వినిపించింది. అందుకే త్వరలో రిలీజ్ కి వస్తున్న ఒకే ఒక్క సినిమాపైనే మెహ్రీన్ ఆశలన్నీ పెట్టుకుందట. మిగలి ఉన్నది ఒకే ఒక్క సినిమా అశ్వథ్థామ. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ప్రచారం చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం అన్నది మెహరీన్ కి అవసరం.
రిజల్ట్ ఏ మాత్రం తేడా వచ్చినా అమ్మడు ఇంటిదారి పట్టాల్సిందేనని గుసగుసలు వినిస్తున్నాయి. మరో అవకాశం రావాలంటే హిట్టు తప్పనిసరి. లేదంటే మరో ఆప్షన్ వెతుక్కోవాల్సిందే. అటు తమిళ్ లోనూ మెహరీన్ కెరీర్ సేమ్ ఫేజ్ లో ఉంది. ఇటీవలే ధనుష్ తో కలిసి నటించిన పటాస్ రిలీజైంది. అది సక్సెసైనా ఇంకో కొత్త సినిమాకు కమిట్ అయినట్లు ఎక్కడా ప్రచారమే లేదు. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితులను హనీ ఎలా బ్యాలెన్స్ చేసి ఒడిదుడుకుల నుంచి బయటపడుతుందో చూడాలి.