బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ ట్యూబ్ లైట్ పై విడుదలకు ముందే భారీ అంచనాలున్నాయి. ఈద్ కానుకగా ఈనెల 23న ట్యూబ్ లైట్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
దంగల్ - బాహుబలి-2ల రికార్డులను బద్దలు చేసే సత్తా కేవలం సల్మాన్ కే ఉందనేది విశ్లేషకుల అంచనా.
ఈ సినిమాకు సల్లూ భాయ్ నిర్మాత కూడా కావడం మరో విశేషం. యష్ రాజ్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో సినిమా విడుదల కానుంది. పాకిస్థాన్ లో ఈ సినిమా రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రంజాన్ మాసంపై పాక్ సినీ ఇండస్ట్రీ గంపెడాశలు పెట్టుకుంది. ఈ టైమ్ లో ట్యూబ్ లైట్ పాకిస్థాన్ లో రిలీజ్ అయితే, అక్కడి సినిమాలకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది.
రంజాన్ సీజన్ లో పరాయి దేశాల చిత్రాల్ని నిషేధించాలంటూ పాక్ లో ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందుతున్నాయి.
భారతీయ సినిమాల ప్రభావాన్ని తగ్గించేందుకు పాక్ ప్రభుత్వం ప్రత్నామ్నాయ మార్గాలు చూస్తోంది. భారతీయ సినిమాలపై ఎన్నో పరిమితులు విధిస్తూ ... ఇరాన్ - టర్కీ దేశాల సినిమాల్ని బాగా ప్రమోట్ చేస్తోంది.
అందులోనూ ట్యూబ్ లైట్ సినిమా భారత్-చైనా యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది. పాక్-చైనా మధ్య రహస్య ఒప్పందాల గురించి ప్రపంచానికి తెలుసు. ఈ నేపథ్యంలో ట్యూబ్ లైట్ సినిమాను పాక్ ప్రభుత్వం అనుమతిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పాక్ లో సినిమా విడుదల కాకుంటే నిర్మాతలకు 30 నుంచి 35 కోట్ల రూపాయల వరకు నష్టమని వినికిడి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/