సినీ నటి - దర్శకురాలు - వైసీపీ నేత జీవితా రాజశేఖర్.. మీడియా ముందుకు వచ్చారంటే... అవతలి వ్యక్తులకు నోట మాట రాదంతే. గతంలో చాలా వివాదాల్లో మీడియా ముందుకు వచ్చిన జీవిత... తనను డిఫెండ్ చేసుకోవడంతో పాటుగా విషయంపై సమగ్ర అవగాహనతోనే వచ్చారు. మీడియా ప్రతినిధుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయన్న విషయంపై కాస్తంత స్టడీ చేసి గానీ ఆమె బయటకు రారన్న వాదన కూడా లేకపోలేదు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తరఫున పత్రికా ప్రకటనలకు సంబంధించి తలెత్తిన వివాదంలోనూ ఆమె ఇదే రీతిన వ్యవహరించారని చెప్పక తప్పదు.
ఇటీవలే ముగిసిన మా ఎన్నికల్లో కార్యదర్శిగా బరిలోకి దిగి సత్తా చాటిన జీవిత... మా వ్యవహారాల్లోనూ తనదైన శైలి చూపిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ తదితర పథకాలను సినిమా వాళ్లకు కూడా తెలియజేసే క్రమంలో మా తరఫున ఇటీవల కొన్ని ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనలు చూసిన వెంటనే... వైరి వర్గం వారు మీడియాకు లీకులిచ్చి మా పై వ్యతిరేక ప్రచారం చేసేందుకు యత్నించారట. దీనిపై భగ్గుమన్న జీవిత... ఈ వివాదం మరింతగా ముదరకముందే ఎంట్రీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను సినిమా వాళ్లకు చేర్చే సదుద్దేశ్యంతోనే మా తరఫున ప్రకటనలు ఇప్పించామని, ఈ ప్రకటనల జారీలో నిబంధనల మేరకే వ్యవహరించామని చెప్పుకొచ్చారు.
మొత్తం ప్రకటనల ఖర్చు రూ.7.5 లక్షలు మాత్రమే అయ్యిందని, ఇంత తక్కువగా యాడ్స్ వేయించడం చాలా కష్టమైన పనేనని, అయినా కూడా మా నిధులు దుర్వినియోగం కాకుండా, దుబారా కాకుండా చాలా జాగ్రత్తగానే యాడ్స్ రూపొందించామని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో నూతన కార్యవర్గం తప్పేమీ లేదని, ఎక్కడా నిబంధనల అతిక్రమణ జరగలేదని, అనుమానం ఉన్న వారు మా కార్యాలయానికి వస్తే.. సవివరంగా వివరిస్తామని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంపై మరింత కంపు చేయొద్దంటూ ఆమె కోరారు. మొత్తంగా మా నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ రేకెత్తిన వివాదాన్ని జీవిత తనదైన శైలిలో ఆదిలోనే అడ్డుకట్ట వేశారన్న వాదన వినిపిస్తోంది.