చిత్రం : 'నోటా'
నటీనటులు: విజయ్ దేవరకొండ - మెహ్రీన్ కౌర్ - సత్యరాజ్ - నాజర్ - ఎం.ఎస్.భాస్కర్ - ప్రియదర్శి - కరుణాకరన్ తదితరులు
సంగీతం: సామ్ సిఎస్
ఛాయాగ్రహణం: సంతాన కృష్ణన్ రవిచంద్రన్
కథ: షాన్ కరుప్పస్వామి
స్క్రీన్ ప్లే: ఆనంద్ శంకర్ - షాన్ కరుప్పస్వామి
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం: ఆనంద్ శంకర్
నెలన్నర కిందటే ‘గీత గోవిందం’తో పలకరించాడు విజయ్ దేవరకొండ. ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న విజయ్.. ఇప్పుడు ‘నోటా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అతను నటించిన తొలి ద్విభాషా చిత్రమిది. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ రోజే విడుదలైన ఈ పొలిటికల్ థ్రిల్లర్ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్ కొడుకు. వాసుదేవ్ ఒక కేసులో జైలుకు వెళ్లాల్సి రావడంతో అప్పటిదాకా విదేశాల్లో ఉండి ఇండియాకు తిరిగొచ్చిన తన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తాడు. అతడికి రాజకీయాలపై ఏమాత్రం అవగాహన.. ఆసక్తి ఉండదు. కానీ విపత్కర పరిస్థితుల్లో అతను ముఖ్యమంత్రి పాత్రను సీరియస్ గా తీసుకుంటాడు. ఆ తర్వాత అతడికి అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఎన్నో సవాళ్లను ఛేదించాల్సి వస్తుంది. మరి వీటిని వరుణ్ ఎలా ఎదుర్కొన్నాడు.. ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర ఎలా వేశాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘నోటా’ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో చూద్దామని ఆరంభం నుంచి చివరి దాకా ఎదురు చూస్తుంటాం. సినిమా అయిపోతుంది. కానీ ఈ సందేహానికి మాత్రం సమాధానం లభించదు. ఈ సినిమాను నడిపించే విషయంలోనూ దర్శకుడికి స్పష్టత లేకపోయింది. ఒకసారి విజయ్ దేవరకొండ శైలికి తగ్గట్లుగా వాస్తవికంగా కథను నడిపించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇంకోసారి అతడికి కమర్షియల్ పంథా గుర్తుకొస్తుంది. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేయలేక.. కథను ఒక తీరుగా నడపలేక.. మొత్తం కంగాళీగా తయారు చేసి పెట్టాడు ఆనంద్ శంకర్. పొలిటికల్ థ్రిల్లర్ గా చెప్పుకున్న ‘నోటా’లో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే అంశాలు లేకపోవడమే పెద్ద మైనస్. పొలిటికల్ డ్రామా కూడా అనుకున్నంత బాగా పండలేదు. పైగా తమిళనాడు సమకాలీన రాజకీయాల్ని.. అక్కడి పరిస్థితుల్ని తలపించే కథాకథనాలు.. సన్నివేశాలు మన ప్రేక్షకులకు ‘నోటా’ను ఓన్ చేసుకోలేని పరిస్థితి కల్పిస్తాయి. విజయ్ దేవరకొండ ఎంత బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ.. అతడిని ముఖ్యమంత్రి పాత్రలో ప్రభావవంతంగా చూపించడంలోనూ దర్శకుడు విఫలమయ్యాడు. అక్కడక్కడా కొన్ని సీన్లు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా ‘నోటా’ సాధారణంగానే అనిపిస్తుంది. వినోదానికి చోటే లేకపోవడం ‘నోటా’కు మరో పెద్ద ప్రతికూలత.
రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాలకు అన్నిటికంటే కీలకమైనది.. బలమైన.. ఆసక్తి రేకెత్తించే కథ. ‘నోటా’ ఈ విషయంలో నిరాశ పరుస్తుంది. రాజకీయాలతో అస్సలు సంబంధం లేని ఒక కుర్రాడు.. అనుకోకుండా ముఖ్యమంత్రి కావడం అనేది కొత్త పాయింటేమీ కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి కథలతో సినిమాలు చూశాం. ఈ మధ్యే ‘భరత్ అనే నేను’ కూడా వచ్చింది. ఇంటెన్స్ గా సాగే ఆ సినిమాలో మహేష్ బాబు లాంటి హీరోను చూశాక.. ‘నోటా’ నుంచి ఇంకేదైనా కొత్తగా ఆశిస్తాం. విజయ్ దేవరకొండ ఉన్నాడు కాబట్టి అతడి శైలికి తగ్గ కథను.. సన్నివేశాల్ని కోరుకుంటాం. కానీ ఈ విషయంలో ‘నోటా’ నిరాశ పరచడానికి ఎంతో సమయం తీసుకోదు. విజయ్ పాత్రను ఎంత సిల్లీగా తయారు చేశారో చెప్పడానికి ఒక ఉదాహరణ చూద్దాం. అప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిని చాలా తేలిగ్గా తీసుకున్న హీరో.. ఒక విషాదం తర్వాత మారిపోతాడు. ఎంతో ఉద్వేగానికి గురవుతూ.. చర్యలకు ఉపక్రమిస్తాడు. ఆ సీన్ చూస్తే ప్రేక్షకులకూ ఉద్వేగం కలుగుతుంది. ఆ సీన్లో.. విజయ్ పెర్ఫామెన్స్ లో ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఐతే ఇలాంటి మూడ్లో ఉన్న సీఎం మళ్లీ రాత్రికి ఫ్రెండు పిలిచాడని గోడ దూకి పార్టీకి వెళ్లిపోతాడు. కథ ఇలా నడిస్తే తెరమీద జనాలే కాదు.. చూసే ప్రేక్షకులు కూడా ఇతనేం సీఎం అనే కదా అనుకుంటారు?
పొలిటికల్ జానర్లో తెరకెక్కే సినిమాల్లో జనాలకు బాగా కనెక్టయ్యే.. స్టాండ్ ఔట్ గా నిలిచే ఎపిసోడ్ల కోసం ప్రేక్షకులు చూస్తారు. అప్పట్లో సంచలన విజయం సాధించిన ‘ఒకే ఒక్కడు’ కావచ్చు.. అంత బాగా ఆడని ‘లీడర్’ కావచ్చు.. ఈ మధ్యే వచ్చిన ‘భరత్ అనే నేను’ కావచ్చు.. వీటిలో వావ్ అనిపించే ఎపిసోడ్లు కొన్ని ఉంటాయి. జనాల్ని బలంగా తాకే అంశాలుంటాయి. ‘నోటా’లో ఒకట్రెండు చోట్ల ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి కానీ.. అవి అనుకున్నంత ప్రభావవంతంగా లేకపోయాయి. హీరో సీఎం అయ్యాక సీరియస్ గా ఛార్జ్ తీసుకునే ఎపిసోడ్ బాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర కూడా విజయ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ద్వితీయార్ధంలో వరద సమస్యల్ని డీల్ చేసే ఒక సీన్ కూడా ఓకే. కానీ ఈ ఊపును కొనసాగించేలా తర్వాత మంచి ఎపిసోడ్లు పడకపోవడంతో ‘నోటా’ గాడి తప్పింది. ప్రథమార్ధం వరకు ఒక తీరుగా నడిచే ‘నోటా’.. ద్వితీయార్ధంలో ఒక దశ దిశా లేకుండా సాగుతుంది. కథ ఎటు పోతోందో అర్థం కాని అయోమయంలో ప్రేక్షకులు పడిపోతారు.
జైలుకెళ్లే సీఎం.. తన స్థానంలో ఒక డమ్మీని పెట్టడం.. వంగి వంగి దండాలు పెట్టే నాయకులు.. రిసార్ట్ రాజకీయాలు.. ఇవన్నీ కూడా తమిళ రాజకీయాల్ని తలపించేవే. వీటితో మన ప్రేక్షకులు కనెక్ట్ కావడమూ కష్టమే. దాదాపుగా ప్రతి సీన్లోనూ తమిళ నేటివిటీని బాగా దట్టించారు. ఇవన్నీ చాలవన్నట్లు నాజర్ పాత్రను మలిచిన తీరు.. ద్వితీయార్ధంలో ఆయనకు వేసిన పేలవమైన మేకప్.. ఆ పాత్రతో ముడిపడ్డ సీన్లన్నింటినీ భరించలేని విధంగా తయారు చేశాయి. నాజర్.. సత్యరాజ్.. ఈ ఇద్దరి ఫ్లాష్ బ్యాక్స్ కూడా కథాగమనానికి అడ్డం పడతాయి. కథతో ముడిపడ్డవే అయినప్పటికీ అవి ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. ఇక తనదైన నటనతో ఓ మోస్తరు సన్నివేశాల్ని కూడా రక్తి కట్టించగలిగే సామర్థ్యం ఉన్న విజయ్ ని ద్వితీయార్ధంలో అస్సలు ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు. చాలాచోట్ల అతను నామమాత్రంగా మారిపోయాడు. మనం చూస్తున్నది విజయ్ సినిమానేనా అన్నట్లుగా నడుస్తుంది ద్వితీయార్ధంలో వ్యవహారం. అంతకంతకూ గ్రాఫ్ పడిపోయి.. చాలా సాదాసీదాగా ముగుస్తుంది ‘నోటా’. మొత్తంగా చూస్తే ‘నోటా’ విజయ్ దేవరకొండ ఇమేజ్ కు కూడా న్యాయం చేయని సినిమా.
నటీనటులు:
విజయ్ దేవరకొండ ఇప్పటిదాకా చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా కనిపించాడు. తనకున్న ఇమేజ్ తో పోలిస్తే చాలా బరువైనది అనదగ్గ సీఎం పాత్రకు అతను న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్లలో అతను చూపించిన ఇంటెన్సిటీ ఆకట్టుకుంటుంది. ప్రెస్ మీట్ సీన్లో అతను అదరగొట్టాడు. ఇంకా కొన్ని సీన్లలో మెరిశాడు. కానీ ఒక దశ దాటాక పాత్రలో బలం తగ్గడంతో విజయ్ కూడా వీక్ అయిపోయాడు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఈ పాత్ర ఎందుకు చేసిందో అర్థం కాదు. ఆమెది దాదాపుగా క్యామియో రోల్ అని చెప్పొచ్చు. ఏ రకంగానూ దానికి ప్రాధాన్యం లేదు. అసలు ఈ చిత్రంలో హీరోయిన్ అంటూ ఎవరూ లేరని అనుకోవచ్చు. మెహ్రీన్ తో పోలిస్తే.. ప్రతిపక్ష నాయకుడి కూతురిగా నటించిన అమ్మాయి పాత్రకు ప్రాధ్యాన్యముంది. ఆమె బాగానే చేసింది. సత్యరాజ్ కీలకమైన పాత్రలో హుందాగా నటించాడు. నాజర్ కూడా ఓకే. కానీ ఆయన పాత్రకు ద్వితీయార్ధంలో వేసిన మేకప్ ఘోరంగా ఉంది. ఎం.స్.భాస్కర్ బాగా చేశాడు. ప్రియదర్శిది చెప్పుకోదగ్గ పాత్ర కాదు.
సాంకేతికవర్గం:
‘నోటా’లో చెప్పుకోదగ్గ పాటలే లేవు. ఉన్న రెండు మూడు పాటలు కూడా ఏమాత్రం ప్రభావం చూపవు. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. కొన్ని సన్నివేశాల్ని బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. సంతాన కృష్ణన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. షాన్ కరుప్పస్వామి అందించిన కథలో ఏమంత విశేషం లేదు. తమిళనాడు సమకాలీన రాజకీయాల నేపథ్యంలో కథను అల్లడం వల్ల మన ప్రేక్షకులకు ఇది కనెక్ట్ కావడమే కష్టం. అసలే అంతంతమాత్రంగా ఉన్న కథకు దర్శకుడు ఆనంద్ శంకర్.. సరైన కథనాన్ని జోడించలేకపోయాడు. సన్నివేశాల విషయంలో కంటిన్యుటీ.. కన్సిస్టెన్సీ లేకపోవడం పెద్ద ప్రతికూలత అయింది. ముఖ్యంగా ద్వితీయార్దాన్ని అతను చాలా వరకు తేల్చేశాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని ఆనంద్ ఎంతమాత్రం దృష్టిలో ఉంచుకోలేకపోయాడు.
చివరగా: నోటా.. ఓటు కష్టమే
రేటింగ్-2.25
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre