ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విషయమై రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ ఉంది.
ఈ సినిమా గురించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల ద్వారా వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు జోడిగా ఈ సినిమాలో కీయరా అద్వానీ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో కొరటాల దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు కు జోడిగా కూడా కొరటాల శివ నటించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఆమెను ఈ సినిమా కోసం కొరటాల తీసుకు రాబోతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు తెలుగులో నటించిన కీయరా మూడవ సారి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఎన్టీఆర్.. కొరటాల శివ ల కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించిన విషయం తెలిసిందే. మరో కీలక పాత్రలో నిత్యా మీనన్ నటించింది. మరోసారి ఎన్టీఆర్ 30 సినిమాలో కూడా కొరటాల ఇద్దరు హీరోయిన్ లను నటింప జేస్తున్నాడని సమాచారం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.