బాబాయి మీదికి అబ్బాయి తొడ కొట్టేస్తున్నాడని.. బాబాయిని అస్సలు లెక్క చేయట్లేదని.. బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ ను తిట్టిపోస్తూ వాట్సాప్ లాంటి చోట్ల మెసేజ్ లు ఫార్వార్డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తెర వెనుక ఏమైనా చేస్తున్నాడో ఏమో కానీ.. మీడియా ముందు మాత్రం బాబాయి గురించి ఒక్క మాట కూడా తూలలేదు ఎన్టీఆర్. బాబాయికి తనకు విభేదాలేమీ లేవని.. సంక్రాంతికి రాబోతున్న బాబాయి సినిమా కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి.. తన వినమ్రతను చాటుకున్నాడు. ఐతే ఎన్టీఆర్ మధ్యాహ్నం ఈ మాట అంటే సాయంత్రానికి బాలయ్య నుంచి రెస్పాన్స్ మరోలా వచ్చింది.
నాకు ఎవరూ లేదు పోటీ.. వస్తే గిస్తే నా కొడుకు - మనవడు పోటీ కావచ్చు అంటూ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశాడు బాలయ్య. ‘‘ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో మంచి పాత్రలు పోషించే అవకాశం లభించింది. అదంతా నా అదృష్టం. జానపదాలు - పౌరాణికాలు - సోషియో ఫాంటసీ... ఇలా విభిన్నమైన సినిమాలు చేశాను. ఎప్పుడూ నా సినిమాలే నాకు పోటీ అని భావిస్తుంటాను. నాకు మరెవ్వరూ పోటీ కాదు. నేను బతికున్నంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటా. నా వారసత్వంగా నా కొడుకు - ఆ తర్వాత మనవడు వస్తారేమో, వాళ్లు నాకు పోటీగా నిలుస్తారేమో’’ అని బాలయ్య అన్నాడు. ఐతే బాలయ్య ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో కానీ.. జనాలు మాత్రం దీన్ని మరోలా తీసుకుంటున్నారు. సంక్రాంతికి ఎన్టీఆర్ తో పోటీ పడుతున్న నేపథ్యంలో అతను తనకు పోటీయే కాదని.. పరోక్షంగా చెప్పాడని, అంతే కాక కొడుకు, మనవడి ప్రస్తావన తేవడం ద్వారా ఎన్టీఆర్ ను లెక్కలోంచి తీసేశాడని అర్థాలు తీస్తున్నారు జనాలు.